Windshield crack grounds air india flight in mangaluru

Air India flight, Mangaluru International Airport, Air India Flight Windshield Crack, Air India airlines, Air india Delhi-Mumbai-Mangaluru flight, Pilot noticed crack and grounded flight

An Air India flight was grounded at Mangaluru International Airport after it suffered a crack in the windshield of its cockpit on Thursday. The Delhi-Mumbai-Mangaluru flight was repaired and sent back to Delhi on Friday morning.

విమాన ప్రయాణికులందరినీ సురక్షితంగా దరికి చేర్చాడు..

Posted: 01/03/2015 01:40 PM IST
Windshield crack grounds air india flight in mangaluru

పైలెట్ అప్రమత్తత వారందరినీ సురక్షితంగా వారివారి గమ్యస్తానాలకు చేర్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 103 మంది ప్రయాణికులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా క్షేమంగా వారిని తీసుకోచ్చాడు ఓ పైలెట్. అతని ముందు జాగ్రత్తే వారిని ప్రమాదపుంటునుంచి కాపాడింది. అయితే ఇందుకు ఆ పైలట్ తన విదులను సక్రమంగా నిర్వహించడం తప్ప మరోకటి చేయలేదు. నిజమే పైలట్ శిక్షణను పొందే క్రమంలో వారిని పలు విషయాలపై అవగాహన కల్పిస్తారు. అందులో భాగంగానే వారు విమానం పరిస్థిని కాస్త ముందుగానే అంచనా వేస్తారు. ఎందుకంటే నిత్యం గగన వీధుల్లో తిరిగే విహాంగాలను ఎక్కడపడితే అక్కడ నిలపి మరమ్మత్తులు చేసుకోలేరు కాబట్టి. అయితే ప్రయాణికుల ప్రమాదం బారిన పడకుంబా జగ్రత్తాగా వ్యవహరించాడు ఓ పైలట్.. అదెలా అంటారా..?

103 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళూరు నుంచి ముంబాయి మీదుగా న్యూఢిల్లీ బయలుదేరిన వెళ్లాల్సిన విమానం రెక్కల్లో పగుళ్లు ఏర్పడినట్లు విమాన పైలట్ గుర్తించి.... మంగళూరు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచన మేరకు పైలట్ విమానాన్ని వెంటనే విమానాశ్రయంలో దింపివేశారు. న్యూఢిల్లీ నుంచి సాంకేతిక సిబ్బందిని రప్పించి... విమానంలో ఏర్పడిన లోపాన్ని సరి చేశారు. ఈలోగా ముంబాయి చేరుకోవాల్సిన ప్రయాణికులను ఇతర విమాన సర్వీసుల ద్వారా పంపించారు. మరమ్మతులు చేసిన అనంతరం ఢిల్లీకి చేరుకోవాల్సిన 47 మంది ప్రయాణికులను ఆ విమానం న్యూఢిల్లీ తీసుకెళ్లింది.  విమానాల్లో సెల్ఫీలకు పోజులిస్తూ పట్టుబడిన ఎందరో పైలెట్ లను మనం చూశాం. వారిలా కాకుండా అప్రమత్తతతో, బాద్యతాయుతంగా  విదులు నిర్వహించే వారిని మనం ప్రశంసించాల్సిందే.

జి.మనోమర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mangaluru International Airport  Air India Flight  Windshield Crack  Air India  

Other Articles