Under construction oh water tank collapses twenty killed

Under-construction water tank collapses, water tank collapses in karnataka, water tank collapses in raichur, over head water tank tragedy 20 killed, 4 mahaboobnagar workers killed, 4 gadwal workers killed in raichur, 4 gadwal workers killed in karnataka, 20 killed, karnataka, yapaladinne, gadwal, water tank, raichur OHT collapse

Four mahboobnagar workers out of Twenty killed and some injured after an under-construction over head water tank collapsed in yapaladinne of raichur on saturday

కర్ణాటకలో విషాదం, వాటర్ ట్యాంక్ కుప్పకూలి 7గురు మృతి

Posted: 01/03/2015 01:36 PM IST
Under construction oh water tank collapses twenty killed

కర్ణాటక రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడి రాయ్చూర్ మండలం యాపలదిన్నెలో శనివారం ఉదయం నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కుప్పకూలడంతో ఏడు మంది దుర్మరణం పాలయ్యారు. కాగా మృతి చెందిన వారిలో నలుగురు మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ కు చెందినవారు వునట్లు సమాచారం. ప్రమాదంలో మృతి చెందిన వారందరూ నిర్మాణ కూలీలుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది కాగా ఈ ఘటనలో మరికోందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను రాయ్చూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. శిధిలాల కింద మరికోందరు చిక్కుకుని వున్నారని.. వారి కోసం తక్షణం సహాయక చర్యలను అదికారులు ప్రారంబించారు.

ఇదిలావుండగా, కర్ణాటకలో వరుసగా నిర్మాణం జరుగుతున్న ఓవర్ హెడ్ ట్యాంకులు కుప్పకూలడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత నెల 25 అంటే సుమారుగా ఎనమిది రోజుల వ్యవదిలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు కుప్పకూలడం ఇది రెండవది. సరిగ్గా క్రిస్టమస్ పర్యదినాన హుబ్బాలి పరిదిలోని కోప్పాల్ గ్రామంలో నిర్మాణంలో వున్న ఓ ఒవర్ హెడ్ ట్యాంక్ కుప్పకూలడంతో పశ్చిమ బెంగాల్ కు  చెందిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన జరిగి పది రోజులు కూడా నిండకుండానే మరో ఘటన చోటుచేసుకోవడంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. వాటర్ ట్యాంక నిర్మాణాలు నాసిరకంగా చేపట్టడం ద్వారానే ప్రమాదాలు సంభవిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

జి.మనోమర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahboobnagar workers  karnataka  raichur  20 dead  

Other Articles