Indian man set the guinness world record for typing 103 words in 47 seconds with nose

Indian man set the Guinness world record, Indian man Mohammed Khursheed Hussain Guinness record, Indian man set Guinness record, Hussain new global benchmark, hyderabadi Hussian sets new record,

A record-breaking typist has set a new world best – by banging out sentences with his CONK. Mohammed Khursheed Hussain, 23, used his heroic honker to punch out 103 words on a computer keyboard to set a new global benchmark.

ITEMVIDEOS: ముక్కుతో హైదరాబాదీ గెన్నీస్ రికార్డు

Posted: 12/30/2014 09:54 PM IST
Indian man set the guinness world record for typing 103 words in 47 seconds with nose

అబ్బుర పరిచే నాసికమే అది. అమ్మాయిలకేంటి, అబ్బాయిలకు కూడా తమ నాసికం అందంగా పొడుగ్గా, చిలక ముక్కులా వుండాలంటే చాలా ఇష్టపడతారు. అయితే ఎంత అందంగా వున్న ముక్కు బాగోలేకపోతే మనిషి ముఖానికి అందమే పోతుంది. కానీ ఎవరైనా ముక్కుతో రికార్డులు నెలకొల్పాలని ఆలోచిస్తారా..? అంటే లేదనే చెప్పాలి. సువాసనలు గుర్తించడానికే కాదు.. ముక్కుతో టెక్ట్స్ కంపోజ్ చేయవచ్చని నిరూపించాడు మన హైదరాబాదీ కుర్రాడు. అంతే కాదు ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పవచ్చని అందుకు తానే ఉదాహరణ అంటూ చెప్పుకోస్తున్నాడు. ఇంతకీ అతను నెలకొల్పిన రికార్డు ఏంటో తెలుసా.?

ఉన్నత విద్యను అభ్యసించడం కోసం లండన్ కి వెళ్లిన హైదరాబాదీ కుర్రాడు మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్ ముక్కుతో కేవలం 47 సెకన్ల వ్యవధిలో 103 పదాలతో కూడిన వ్యాఖ్యాన్ని కంపోజ్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇందుకోసం అతని రోజుకు ఆరు గంటల పాటు మూడు సంవత్సరాలుగా శిక్షణ పోందానని తెలిపాడు. తన చేతులు వెనక్కి కట్టిన అనంతరం గిన్నిస్ రికార్డు ప్రత్యేక ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ ప్రకియను చూసి వారే అబ్బురపడ్డారు. దీంతో మన హైదరాబాదీ సప్త సముద్రాల అవతల కూడా విదేశీ గడ్డప కూడా సత్తా చాటినట్లు అయ్యింది.

అంతకుముందు మరో గిన్నీసు ప్రపంచ రికార్డును సోంతం చేసుకున్న హుస్సేన్ కు ఇది రెండవ రికార్డు. అంతకుముందు మూడు సెకన్ల 43 గడియల్లో అతను ఇంగ్లీషు పదాలను కంపోజ్ చేయడంతో అతనికి తొలి గిన్నీస్ ప్రపంచ రికార్డు వరించింది. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ రికార్డు కోసం కష్టపడుతున్నప్పుడు ప్రతీ మిల్లీ సెకండును కూడా పరిగణలకి తీసుకోవాలని చెప్పుకోచ్చాడు. అయితే తాను రెండో గిన్నీస్ రికార్డు కోసం కష్టపడుతున్నప్పుడు కేవలం ఒక కంటితోనే చూస్తూ కంపోజ్ చేశానని చెప్పాడు. రెండోసారి గిన్నీస్ రికార్డు తనను వరించినందుకు సంతోషంగా వుందని చెప్పాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Guinness world record  Mohammed Khursheed Hussain  nation  Indian man  

Other Articles