ముంబయి దాడుల కేసులో ప్రధాన సూత్రధారి జాకిర్ రెహమాన్ లఖ్వీని మరోమారు పాకిస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్ననే ఆయన అదుపులోకి తీసుకోవడాన్ని రద్దు చేసిన న్యాయస్థానం..ఇవాళ మరో కేసులో అదుపులోకి తీసుకుంది. కోర్టు తీర్పు మేరకు ఇవాళ విడుదల కావాల్సిన లఖ్వీని పాకిస్థాన్‌లో పోలీసులు మరో కేసులో అరెస్టు చేసి మంగళవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. లఖ్వీ బెయిల్‌పై విడుదల కావడానికి కొన్ని గంటల ముందే పోలీసులు అన్వర్ అనే ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో లఖ్వీని అరెస్టు చేశారు.
కాగా ముంబై దాడుల కేసులో లఖ్వీకి బెయిల్ లభించడంపై భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. పలుమార్లు స్పష్టమైన ఆధారాలు పాకిస్థాన్ ప్రభుత్వానికి అందించినా.. కేసును నీరుగార్చేందుక అక్కడి ప్రభుత్వమే తీవ్రవాదులకు సహకరిస్తున్న ఆరోఫణలు కూడా ఎంతో మంది భారతీయుల నుంచి వినిపించాయి. లఖ్వీని ఐదు లక్షల రూపాయల ష్యూరిటీ బాండ్లపై అక్కడి ప్రభుత్వం బెయిల్ మంజూరు చేసింది.
అయితే ఒక కేసులో సాక్షాలు లేవంటూ అతని విడుదల చేసిన అక్కడి న్యాయస్థానాలు.. అందుకు సమ్మతించిన పోలీసులు మరో కేసులో లఖ్వీని అదుపులోకి తీసుకున్నారు. లఖ్వీని నేరచరిత్ర వుందని ఇక్కడే భయటపడుతున్నా.. అ దేశ ప్రభుత్వం మాత్రం లేదు లఖ్వీకి ముంబై దాడుల ఘటనలో ప్రమేయమే లేదని వక్కానించడం ఎంతవరకు సమంజసం. అరేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడిగా వున్న వ్యక్తి ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడన్న విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వానికి తెలియాలి. క్షణికావేశాలకు గురై, లేదా ఆస్తుల పంపకాల విషయంలోనో కాకుండా డబ్బు కోసం పసివాడిని కిడ్నాప్ చేసిన లఖ్వీకి ముంబాయి దాడుల కేసులో బెయిల్ రావడం ఎంత వరకు సమంజసమే ఐక్యరాజ్యసమితికైనా తెలియాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more