Muralidhar rao comments on trs party in nalgonda

muralidhar rao comments TRS party, muralidhar rao comments Telangana government, Telangana Government should stop divide and rule, Trs government should stop divide and rule, TRS government should gear up for development,

BJP National secratary Muralidhar rao advices telangana government to stop divide and rule politics and gearup for state development

ప్రజల్లో ఐక్యత పెంచేలా ప్రభుత్వం పనిచేయాలి..

Posted: 12/30/2014 06:23 PM IST
Muralidhar rao comments on trs party in nalgonda

ప్రజలను ప్రాంతాల వారీగా వర్గాలుగా విడదీసే రాజకీయలకు స్వస్తి పలకాలని తెలంగాణలోని కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు హితవు పలికారు. నల్గొండలో చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మద్య వైరుధ్యాన్ని పెంచడంలో కాకుండా అభివృద్ది సాధించి ప్రజల మన్ననలను పొందడంలో చూపాలని ఆయ సూచించారు. గతంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు చేసిన ప్రసంగాలు.. ప్రభుత్వాధినేతగా కూడా చేస్తే ప్రజలు అసంతృప్తికి గురవుతారన్నారు.

ఆవిష్కృతమైన నూతన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కలసి పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో ఏర్పడిన అభద్రత భావాన్ని తొలగిస్తేనే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో పని చేయాలని మురళీధర్ రావు ప్రభుత్వానికి సూచించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muralidhar rao  BJP National General Secretary  nalgonda  

Other Articles