Telangana gets nod to display tableau at republic day

kcr goverment 26 th january celebration in delhi, telangana tableau, republic day celebration by telangana government, telangana tableau in delhi, telangan 26th january parade vehicle in delhi

tableau during the Republic Day parade in New Delhi on January 26. ... they are allowing Telangana vehicle to portray itself in the republic day celebrations

తెలంగాణ ప్రభుత్వం కేంద్రం చూపు కోసం ఆరాటపడుతుందా??

Posted: 12/26/2014 06:07 PM IST
Telangana gets nod to display tableau at republic day

ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టిలో పడాలని తహ తహ లాడుతున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం ఉండక కొంత, సరైన సంభంధాలు లేక కొంత తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం ఎప్పుడు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు సరి కదా కేంద్రం దగ్గర తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పనులు వట్టి నీటి మూటలే కాక తప్పలేదు. అప్పుడు అందుకే కేంద్రం తో సరైన సంబంధాలు నెరపే నాయకుడు కావాలని బిజెపి కి అత్యంత సన్నిహితంగా ఉండే జీతేందర్ రెడ్డి ని కెసిఆర్ తెరాస పార్లమెంటరీ నేత గా ఎంపిక చేశారు. ఇప్పటికి కేంద్రంతో ఏ పని కావాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జితేందర్ రెడ్డితోనే కొన్ని పనులు చేయించుకుంటూ వచ్చింది.

కాని ఇప్పుడు మాత్రం పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. కేంద్రం లో కెసిఆర్ కు మరియు నరేంద్ర మోడీ కి ఈ మధ్య మంచి సంబంధాలు ఏర్పడటం తో కేంద్రం లో కొన్ని పనులు కొంత సులభంగా జరిగిపోతున్నట్లు తెలుస్తుంది., తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య,ప్రత్యేకించి టిఆర్ఎస్ నాయకత్వానికి, కేంద్రంలోని బిజెపి నాయకత్వానికి మధ్య కొంత సత్సంబంధాలు ఏర్పడినట్లే కనిపిస్తుంది. తెలంగాణ శకటానికి కేంద్రం అనుమతించడం ఒక నిదర్శనమైతే, ముఖ్యమంత్రి కెసిఆర్ కోరినట్లు ఎపి ఎక్స్ ప్రెస్ రైలు పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చడానికి కూడా కేంద్రం అంగీకరించింది.

కాని ఈ మధ్య తెలంగాణా ప్రభుత్వానికి ఒక చిక్కొచ్చి పడింది. లోక్ సభలో టిఆర్ఎస్ పక్ష నాయకుడు ఎపి జితేందర్ రెడ్డి తెలంగాణ శకటం కోసం గట్టి ప్రయత్నం చేశారు. ఎపికి రిపబ్లిడ్ డే ప్రదర్శనలో అనుమతి ఇచ్చి, తెలంగాణ శకటానికి అనుమతి రాకపోవడం సహజంగానే ఇబ్బందిగా ఉంటుంది.ఈ నేపధ్యంలో జితేందర్ రెడ్డి రక్షణశాఖ మంత్రి పరిక్కర్ ను కలిశారు. అయినా పని జరగకపోవడంతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లిని కలిసి మళ్లీ విజ్ఞప్తి చేశారు. జైట్లి చొరవ తీసుకుని ఫోన్ చేసి ఫరిక్కర్ ను పరిశీలించాలని కోరారు. ఆ మీదట పరిక్కర్ అదికారులతో మాట్లాడి చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొంతలో కొంత సంబంధాలు మెరుగుడపడకపోతే, ఒకసారి నో అన్న తర్వాత రిపబ్లిక్ డే శకటాలకు అంత తేలికగా అనుమతులు రావు.ఇది మంచి పరిణామమే!! మొత్తానికి తెలంగాణ శకటానికి అనుమతి ఇవ్వటం పట్ల తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : republic day  telangana tableau  central government  

Other Articles