Keshineni nani fires on police commissioner and minister devineni uma

keshineni travels, keshineni nani, vijayawada mp keshineni nani, keshineni nani mp, keshineni travels incident, keshineni nani political career, keshineni nani statement about vijayawada police commissiner

keshineni nani vijayawada mp fires on vijayawada police commissioner and mninister devineni uma

ఎందుకో అంత కోపం మరి...!!

Posted: 12/26/2014 06:24 PM IST
Keshineni nani fires on police commissioner and minister devineni uma

ఈ మధ్య ఎమ్.పి కేశినేని నాని అసంతృప్తి స్వరం పెంచుతున్నారు. ఇటీవల ప్రధానంగా ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎబి వెంకటేశ్వరరావుపై విమర్శలు కురిపించారు. పోలీసు కమిషనర్ తన పేరు కోసం పని చేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని ఆయన అన్నారు. ప్రజలతో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు ప్రజలకు జవాబుదారి అని, అదికారులు ఇవ్వాళ వచ్చేవాళ్ళు..రేపు పోయేవాళ్ళని  కాని, వారి చర్యలకు తాము బాద్యత వహించవలసి ఉంటుందని అన్నారు.విజయవాడలో వారు ఇష్టం వచ్చినట్లు ఆంక్షలు పెట్టి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం సరికాదని అన్నారు.

విజయవాడ శాంతిగా ఉండే నగరమని అన్నారు. మంత్రి దేవినేని ఉమ అందరిని కలుపుకుని వెళ్లాలని ఆయన అన్నారు. ఇప్పటికే కార్యకర్తలు అతని ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అది ఎక్కువైతే పార్టీ కి తీరని నష్టం జరుగుతుందని అది మంచిది కాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని అబివృద్ది పనులు చేసినా, అధికారులు తమ మధ్య సమన్వయం లేకపోతే ఉపయోగం ఉండదని అన్నారు. చంద్రబాబుకు తెలియడానికే తాను బహిరంగంగా వ్యాఖ్యానించానని, సభలో మాట్లాడానని స్పష్టం చేశారు. తనకు డొంక తిరుగుడుగా మాట్లాడడం తెలియదని, తాను ఇక్కడి వాడినని, ఈ నగరంలో పెరిగానని అన్నారు. పార్టీకి తానెప్పుడు వ్యతిరేకంగా చెప్పలేదని, కేవలం తన అవ్హిప్రాయాన్ని మాత్రమే తెలియజేసానని చెప్పారు. కాగా ఎమ్.పి కేశినేని నాని చెప్పిన విషయాలతో తాను అంగీకరిస్తున్నానని మంత్రి నారాయణ కూడా అన్నారు. అధికారులతో సమన్వయం అవసరమని ఆయన అబిప్రాయపడ్డారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : keshineni nani  minister devineni uma  vijayawada police commissioner  

Other Articles