Sathya nadella father opposes to ap government about ap capital

ap capital, sathya nadella family members, sathya nadella father, sathya nadella native place, sathya nadella position, sathya nadella father job, sathya nadella microsoft ceo, bn yugandhar sathya nadella father, bn yugandhar ias

sathya nadella father oposing about ap capital

ఎపి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్య నాదెళ్ళ తండ్రి

Posted: 12/26/2014 01:50 PM IST
Sathya nadella father opposes to ap government about ap capital

ఎపి లో జరుగుతున్న్ రాజధాని నిర్మాణం కోసం అక్కడ చుట్టూ రైతులు సాగు చేసుకుంటున్న పచ్చని పొలాలు తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు వ్యతిరేకంగా వచ్చే నెలలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఒక సమావేశం జరగబోతున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో చాల మంది మేధావులు పాల్గొనబోతున్నట్లు సమాచారం. దానిలో సత్య నాదెళ్ళ తండ్రి మాజీ ఐ ఏ ఎస్ అధికారి అయిన బి ఎన్ యుగంధర్ కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. రాజధాని నిర్మాణం కోసం పచ్చని పొలాలు ఎందుకు నాశనం చేయాలనీ వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వీరు ఈ విషయం లో ముఖ్యమంత్రి ని కూడా కలిసినట్లు సమాచారం. ఇందులో మైక్రోసాఫ్ట్ సిఇఓ అయిన సత్య నాదెళ్ళ తండ్రి బి ఎన్ యుగంధర్ కూడా ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

హక్కుల నేతలలో ఒకరైన బి.ఎన్.యుగంధర్ తో పాటు పలువురు రిటైర్డ్ ఐఎఎస్ లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, మేధావులు,హక్కుల సంఘాల నేతలు పాల్గొనబోతున్నారు.యుగంధర్ కేంద్రంలో పలు కీలక పదవులలో ఉన్న మాజీ ఐఎఎస్.ఆయన హక్కుల విషయంలో ప్రజల తరపున నిలబడుతుంటారు. ప్రముఖ జర్నలిస్టు సాయినాధ్, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం, మాజీ ఐఎఎస్ లు ఇ.ఎ.ఎస్.శర్మ, దైవ సహాయం, ఆంజనేయరెడ్డి, కె.ఆర్.వేణుగోపాల్ ( పివి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శిగా ఉండేవారు) కూడా ఇందులో బాగస్వామి అవుతున్నారు.కృష్ణా డెల్టా హక్కుల పోరాట కమిటీ కన్వీనర్ గా ఉన్న మల్లెల శేషగిరిరావు మాట్లాడుతూ పంట పొలాలను ప్రభుత్వం తీసుకోవడాన్ని రాజకీయంగాను, చట్టపరంగాను ఎదుర్కుంటామని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ లో కావాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొని,ఎందుకు పొలాలు తీసుకోవలసి వస్తుందో చెప్పి ఒప్పిస్తే తాము భూములు ఇవ్వడానికి సిద్దమని ఆయన అన్నారు.న్యాయపరంగా అన్ని విషయాలను పరిశీలిస్తున్నామని మల్లెల చెప్పారు. హైదరాబాద్ లో జరిగే రౌండ్ టేబుల్ కు ఇలాంటి ప్రముఖులు అంతా వస్తే అది దేశం యావత్తును ఆకర్షించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎపి ప్రభుత్వం మరిన్ని విమర్శలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. కాని ఇందులో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత తండ్రి యుగంధర్ పాల్గొనటం అందరికి ఆసక్తిని కలిగిస్తుంది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : bn yugandhar  microsoft ceo sathya nadella  ap goverment  ap capital  

Other Articles