Andhrapradesh chief minister chandrababu targets cantonment elections

AndhraPradesh chief minister chandrababu, chandrababu targets cantonment elections, AP chief minister chandrababu, AP CM chandrababu, AP CM chandrababu targets cantonment elections, chandrababu telangana Tdp leaders, chandrababu cantonment leaders meet, chandrababu eyes cantonment elections,

AndhraPradesh chief minister chandrababu targets cantonment elections, hold meeting with Telangana TDP leaders

తెలంగాణలోని ఎన్నికలకు ఆంధ్రా నిధులా..?

Posted: 12/26/2014 01:29 PM IST
Andhrapradesh chief minister chandrababu targets cantonment elections

తెలంగాణలో తన సత్తాను చాటుకునేందుకు మరోమారు అందింవచ్చిన అవకాశాన్ని సద్వినయోగం చేసుకునేందుకు రంగంలోకి దిగారు చంద్రబాబు. నగరంలో బాగమైనప్పటికీ.. ప్రత్యేక పరిస్థితుల దృశ్యా బోర్డు ఏర్పాటు చేసుకుని అభివృద్ది సాగిస్తున్న కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధించిన విజయాన్ని కంటోన్మెంట్ ఎన్నికలలో కూడా ప్రతిఫలించేలా చేయాలని ఆయన ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇందులోభాగంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తెలంగాణ టీడీపీ నేతలు, ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంత నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో టీటీడీపీ కీలక నేతలు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్నతోపాటు ఆ ప్రాంతానికి చెందిన నేతలు కూడా హాజరుకానున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టవలసిన కార్యచరణపై బాబు, టీటీడీపీ నేతలు ఈ సందర్భంగా చర్చిస్తారు. అయితే కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఎంత డబ్బు ఖర్చైనా ఫర్వాలేదు.. టీడీపీ క్లీన్ స్వీప్ చేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించనున్నారని తెలుస్తోంది. దీంతో తెలంగాణలోని కంటోన్మెంట్ ఎన్నికలకు ఆంధ్ర నుంచి నిదులు తరులుతున్నాయని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.

నవంబర్లో విడుదలైన నోటిఫికేషన్ మేరకు 2015, జనవరి 11న జరగనున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు సార్టీ నేతలను ఆయన సమాయత్తం చేస్తున్నారు. కంటోన్మెంట్లో మొత్తం ఎనిమిది వార్డులలో విజయాన్ని సాధించాలని ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఓటుహక్కును వినియోగించుకునే దాదాపు 2.30 లక్షల మంది ఓటర్లును అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు కలవాలని ఆయన సూచించనున్నట్లు సమాచారం. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అందివచ్చిన అన్ని మార్గాలను అందిపుచ్చుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించనున్నారు. దీంతో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ తమను ఎంత దెబ్బ కోట్టినా.. తాము పుంజుకుంటామని, తమకు ప్రజల్లో బలముందన్న సంకేతాలను ఇవ్వాలని యత్నిస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  Telangana TDP leaders  cantonment elections  

Other Articles