Telugu association of north america tana invites kcr detroit conference

TANA invites kcr, kcr TANA meetings, TANA detroit meeting updates, TANA latest updates, TANA members programmes, kcr on TANA, telangana latest updates, kcr foreign tours updates

telugu association of north america TANA invites kcr detroit conference : TANA leaders invites telangana chief minister kcr to attend detroit conference, there is rumors that telangana cm will not attend telugu meeting in america

తానా పిలిస్తే తందానా అనుకుంటూ వెళ్తారా ఏంటి...?

Posted: 12/26/2014 07:27 AM IST
Telugu association of north america tana invites kcr detroit conference

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే బాష, ఆత్మగౌరవం, స్థానికతకు చాలా ప్రధాన్యత ఇచ్చే తెలంగాణ సీఎం, తొలిసారి తెలంగాణేతర కార్యక్రమానికి వెళ్లాల్సి వస్తోంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మహాసభలకు కేసీఆర్ ను ఆహ్వానించారు. డెట్రాయిట్ లో జరిగే సభలో పాల్గొనాలని తానా ముఖ్య నేతలు తోటకూర ప్రసాద్, నన్నపనేని మోహన్, జంపాన చౌదరి తదితరులు కలిసి కేసీఆర్ ను కోరారు.

ఈ సందర్బంగా అమెరికాలో తెలుగువారి అభివృద్ది కోసం సంఘం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్ వివరించారు. ఇదంతా పక్కనబెడితే.., తెలుగువారు అనే భావనతో నిర్వహిస్తున్న ఈ అసోసియేషన్ సభ కోసం అమెరికా వెళ్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. గతంలో చాలామంది తెలుగు సభలకు ఆహ్వానించినా.., అక్కడ తెలంగాణకు సరైన గుర్తింపు లేదని కేసీఆర్ వెళ్లలేదు. మరి ఇప్పటికీ తెలుగు అనే సమైక్య నినాదంతో కొనసాగుతున్న తానా సభకు వెళ్తారా లేక, తెలంగాణ సభ అయితేనే వస్తాను అంటారా త్వరలో తెలియనుంది.

 

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TANA updates  kcr latest  telangana news  

Other Articles