Telugu content

Leopard scares groom, Leopard scares groom in uttarpradesh, Leopard scares groom in moradabad, Leopard scares groom at Thakudwara, Leopard attends marriage, villagers chased leopard,

All hell broke loose during a marriage at Thakurdwara here when a leopard came uninvited to the party.

పిలవని పెళ్లికి వెళ్లిన అతిధి.. పరుగుల పెట్టించింది.

Posted: 12/25/2014 10:00 PM IST
Telugu content

పిలవని పేరంటానికి వెళ్లింది. సరే వెళ్తే వెళ్లిందని ఊరుకుందామా..? అక్కడ అందరినీ పరుగులు పెట్టించింది. అంతేకాదు పాపం మరికొన్ని క్షణాల్లో ఓ వధువు మెడలో మాంగళ్యధారణ చేయాల్సిన వరుడిని.. కనీస కనికరం కూడా లేకుండా పరుగులు పెట్టించింది. చివరకు వరుడు వెళ్లి ఓ గదిలో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే అడపెళ్లి వారితో పాటు ఊరంతా కలసి కర్రలు, బాలుషాలు తీసుకుని అతిధిని వెంటపడి మరీ తరిమారు. ఇంతకీ అనుకోని అతిధిని ఎందుకు తరిమారనేగా మీ సందేహం. అతిధి ఎవరనా..?

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని మెరాదాబాద్ జిల్లాలో వైభవంగా జరుగుతున్న ఓ వివాహ వేడుకుకు అనుకోని అతిధిగా వచ్చింది చిరుత పులి. అంతే.. అక్కడున్న వారు ఎక్కడికక్కడ పరుగులు తీశారు. పెళ్లి మండపం అంతా క్షణాల్లో ఖాలీ అయిపోయి గందరగోళంగా తయారైంది. మరి కొన్ని గంటల్లో తన జీవిత బాగస్యామితో సహజీవనం సాగించాల్సిన పెళ్లి కుమారుడు పీటల పైనుంచి లేచి పురుగు లఖించుకున్నాడు. ఓ గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుని దాక్కున్నాడు.  చిరుత పులి వచ్చిన సమాచారం ఊరంతా వ్యాపించింది.

అంతే పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులతో పాటు ఊరంతా కలసి ఇనుప రాడ్లు, కర్రలు, బలిశలు పట్టుకుని చిరత వెంట పడ్డారు. దగ్గర్లోని అటవీ ప్రాంతం నుంచి వచ్చిన దానిని మళ్లీ అక్కడికే తరిమివేశారు. ఆ తరువాత ముహూర్తం దాటిపోయినా పర్వాలేదని పెళ్లికోడుకు తీసుకువచ్చి పెళ్లి తంతు కానిచ్చేశారు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు పిర్యాదు చేయగా, చిరుత పులని పట్టుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Leopard  MORADABAD  Uttar pradesh  Police  Forest Officials  

Other Articles