Metro trai run start on janaury

metro trail run in januvary, ready to begin service in 2015, Telangana government on metro rail, Telangana chief secrataey rajeev sharma, Telangana CS rajeev sharma review on metro,

Telangana chief secratary reviews on metro rail trail run, says to go ahead in januvary after railway safety certificate

వచ్చే ఏడాదిలో ప్రయాణానికి సిద్దం అంటోంది..

Posted: 12/25/2014 08:06 PM IST
Metro trai run start on janaury

ఎన్నో ఏళ్లుగా ఆశగా చూస్తున్న నగరవాసులు స్వప్నం త్వరలో తీరబోతోంది. నగరవాసులకు నూతన సంవత్సర కానుకగా నాగోల్-మెట్టుగూడా రూట్లో  మెట్రో రైలు ట్రయల్ రన్‌ను జనవరిలోనే నిర్వహించాలని ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ వర్గాలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మెట్రో పనుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సేఫ్టీ సర్టిఫికెట్ (భద్రత)జారీ చేసిన అనంతరమే ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా నాంపల్లి, బేగంపేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మెట్రో పనులు చేపట్టేందుకు వీలుగా 283 ఆస్తుల సేకరణ ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని సీఎస్‌జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే ఇందులో సగానికిపైగా ఆస్తులను సేకరించి, బాధితులకు పరిహారం అందజేసినట్లు సంబంధిత అధికారులు వివరించారు. కాగా  ప్రస్తుతం నాగోల్-మెట్టుగూడా (8 కి.మీ.) మార్గంలో నిత్యం 8 మెట్రో రైళ్లకు 18 రకాల ప్రయోగపరీక్షలు(టెస్ట్న్)్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇదే మార్గంలో మార్చి 21,2015 (ఉగాది) రోజున మెట్రో ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Year's gift  Nagol-mettuguda  Metro trial run  

Other Articles