Union home minister rajnath singh chopper makes emergency landing

Union Home Minister Rajnath singh, Rajnath singh escaped major accident, Rajnath singh chopper developed technical snags, Rajnath singh chopper technical snags, Rajnath singh Chopper makes Emergency landing, Rajnath singh Chopper Emergency landing in Assam, union minister for state kiren rajijju, kiren rajijju escaped major accident, Rajnath singh, Kiren Rjijju, Chopper, Emergency landing, techincal snags, Assan tour,

Union Home Minister Rajnath singh escaped major accident when his Chopper developed technical snags during his tour of Assam

తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న కేంద్ర మంత్రి..

Posted: 12/25/2014 08:11 PM IST
Union home minister rajnath singh chopper makes emergency landing

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అసోంలో తీవ్రవాదుల దాడుల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రాజ్‌నాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో అత్యవసరంగా దిగిపోయింది. తేజ్‌పూర్ ఐఏఎఫ్ ఎయిర్‌బేస్ నుంచి కోక్రాఝర్ బయలుదేరిన రాజ్‌నాథ్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే తిరిగి తేజ్‌పూర్ ఐఏఎఫ్‌లోనే అత్యవసరంగా దిగింది. హెలికాప్టర్‌లో రాజ్‌నాథ్‌తో పాటు సహాయ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఉన్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో కోక్రాఝర్ నుంచి వచ్చిన మరో హెలికాప్టర్‌లో రాజ్‌నాథ్ తన ప్రయాణాన్ని కొనసాగించారు.

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహాయ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి అసోంలోని సోనిట్‌పూర్‌ని సందర్శించారు. అక్కడి రాజకీయనేతలతోనూ, స్వచ్ఛంద, సామాజిక సంస్థలవారితోనూ ఆయన చర్చలు జరిపారు. పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున పునరావాస శిబిరాలను వారు సందర్శించలేదు. బిశ్వనాథ్ చరియాలిలోని సర్క్యూట్‌హౌస్‌లో ఆదివాసి ప్రతినిధులతో కేంద్రమంత్రులు చర్చలు జరిపారు. దారుణ మారణకాండతో 70 మందికి పైగా ప్రాణాలను హరించిన ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్)పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టంచేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajnath singh  Kiren Rjijju  Chopper  Emergency landing  techincal snags  

Other Articles