Central government announced bharat ratna to vajpayee and madan mohan malavya

central government, bjp government, bharat ratna, vajpayee, madan mohan malavya

central goverment announced bharat ratna to bjp leader vajpayee and madan mohanb malavya

బంగారు నేతకు, భవితనిచ్చిన యోధకు "భారత రత్న"

Posted: 12/24/2014 12:29 PM IST
Central government announced bharat ratna to vajpayee and madan mohan malavya

అధికార బిజెపి ఇటీవల తమ అగ్ర నేతను అత్యున్నత పురస్కారంతో సత్కరింపజేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. వాజ్ పేయ్  పుట్టిన రోజు ఈ నెల 25 కావటంతో  ఆయన పుట్టిన రోజున ఈ సత్కారాన్ని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దానికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు , ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు పండిత్ మదన్ మోహన్ మాలవ్యా పేరు రెండూ రాష్ట్రపతి కి సిఫార్సు చేసింది.

వారిద్దరికీ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' అవార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశంపై కేంద్ర కేబినెట్ బుధవారం ఉదయం ప్రధాని మోదీ నివాసంలో భేటీ అయ్యింది. చర్చల అనంతరం కేంద్ర మంత్రివర్గం వీరిద్దరికి భారతరత్న ఇచ్చేందుకు ఆమోదం తెలిసింది. అనంతరం రాష్ట్రపతి భవన్కు సిఫార్సులు పంపించింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ భారత రత్న అవార్డు అందుకున్న ప్రధాన మంత్రులలో వాజ్ పేయ్ ఏడవ వ్యక్తిగా నిలిచారు.

వాళ్ళిద్దరికీ భారత రత్న ప్రకటించటం పట్ల పలు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వాజ్ పేయ్ కి భారత రత్న ఇవ్వాలని తెలుపుతూ చాల మంది మద్దతుగా నిలిచారు. నితీష్ కుమార్ మరియు ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : bjp government  declared  bharat ratna  

Other Articles