Fast food slows down children s brains

Fast food slows down childrens brains, Fast food impact on childrens education, Ohio State University study, fast food consuming children perform worst

Parents, please note! Fast food may slow the brain and make children perform worse in school, a new study has warned.

చిన్నారులూ.. చదువులో రాణించాలంటే.. అది వదిలేయండి..!

Posted: 12/24/2014 01:39 PM IST
Fast food slows down children s brains

మీ చిన్నారుల కోసం ఫాస్ట్ ఫుడ్ తీసుకెళ్తున్నారా..? మీ పిల్లలు దానిని తినడానికే అధికంగా ఇష్టపడుతున్నారా..? అయితే జాగ్రత్తా.. ఫాస్ట్‌ఫుడ్‌ను తినే చిన్నారుల్లో మెదడులో జోరు తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. అలాంటి పిల్లలు చదువులో వెనకపడిపోతారని పేర్కొంది. అమెరికాలోని ఒహియో విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అధ్యయనంలో 8వేల మందికిపైగా చిన్నారులు పాలుపంచుకున్నారు. ఈ పిల్లలు పదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు వారి ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లను పరిశీలించారు. ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో తినుబండారాలను ఎన్నిసార్లు తిన్నారో తెలుసుకున్నారు. గడిచిన వారంలో ఒకటి నుంచి మూడుసార్లు తిన్నామని 52 శాతం మంది చెప్పారు. నాలుగు నుంచి ఆరుసార్లు తిన్నట్లు 10 శాతం మంది తెలిపారు.

మూడేళ్ల తర్వాత బడిలో నిర్వహించిన పరీక్షల్లో వారు సాధించిన ఫలితాలతో దీన్ని పోల్చి చూశారు. రోజూ ఫాస్ట్‌ఫుడ్ తిన్నవారు సైన్స్ పరీక్షల్లో 79 పాయింట్లు సాధించగా.. అసలు తిననివారు 83 పాయింట్లు పొందారు. పఠనం, గణితంలోనూ ఇలాంటి వైరుద్ధ్యాలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇనుము లోపిస్తుందని, అందువల్ల మెదడులో కొన్ని ప్రక్రియలు మందగిస్తాయని పరిశోధకులు అంచనావేస్తున్నారు. కొవ్వు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారాల వల్ల అభ్యాస ప్రక్రియపై దుష్ప్రభావం పడుతుందని మరో సిద్ధాంతం పేర్కొంటోంది.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fasr food  children  brain  education  Ohio State University  

Other Articles