Ways to improve employee boss relationships

employee and boss, boss employee relation ship, employee realtion ship with boss, boss relation ship with boss

In order to run a successful business and to have a good career both employee and boss need to establish a strong relationship

యజమాని-ఉద్యోగి సంబంధాలు

Posted: 12/16/2014 06:32 PM IST
Ways to improve employee boss relationships

నలుగురితో కలిసి పని చేసేవాడు నాయకుడు.., నలుగురితో పని చేపించేవాడు. ఎప్పుడో ఒక మహానుభావుడు యజమానికి మరియు నాయకునికి స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. అవును యజమాని ఎప్పుడు ఉగ్యోగికి యాజమాని లానే కనబడతాడు. యజమాని ఎప్పుడు ఉద్యోగులపై ఆజమాయిషీ చేయాలనే చూస్తాడు. ఎందుకంటే అతను యజమాని కాబట్టి... ఒక సంస్థ నడపబడాలి అంటే దానిని సమర్థవంతంగా నడిపించే యజమానికి.., ఎంత నైపుణ్యం ఉండాలో, ఎంత ప్రాముఖ్యత కల్పించాలో.., అదే సంస్థలో పని చేసే ఉద్యోగికి., కూడా అంతే నైపుణ్యం కలిగి ఉండాలి, అంతే ప్రాముఖ్యత కల్పించబడాలి. 'యజమాని మరియు సంస్థలో పని చేసే ఉద్యోగులు' మనం నడిపే ద్విచక్ర వాహనానికి ఉండే చక్రాల్లాంటి వారు...., ఏ ఒక్క చక్రం పని చేయకపోయినా లేదా లేకపోయినా ఆ వాహనం వృధా. అందుకే యజమాని ఎంత జాగ్రత్తగా తన ఉద్యోగులతో సఖ్యపూర్వకంగా మెదిలితే సంస్థ లాభాలు కూడా అంతే సఖ్యంగా ఉంటాయనేది వాస్తవం.

యజమాని ఎప్పుడైతే ఉద్యోగుల పట్ల అవివేకంతో వ్యవహరిస్తాడో అప్పుడు ఉద్యోగి తన 'పని' అనే ఆలోచనా ధోరణిని మార్చుకుంటాడు. తన ఉద్యోగుల ద్వారా ఒక వారం రోజుల పనిని  'ఒకే వ్యక్తి ద్వారా ఒకే రోజులో' రాబట్టుకోవచ్చు అనుకుంటారు కొంత మంది యజమానులు. నిజమే ఆ ఉద్యోగి కూడా అంతే మొత్తంలో తన నైపుణ్యానికి పదును పెట్టి, ఆలోచనలకు కార్పెట్ పరచి సంస్థ తన నుండి కోరుకుంటున్న దాని కంటే ఎక్కువే ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే తన నైపుణ్య సామర్థ్యాన్ని సంస్థకు చాటి చెప్పటం కోసం... తన తెలివిని యజమాని గుర్తించటం కోసం...., కాని మరుసటి రోజు నుండి అతని మనసు పొరల్లో ఒక రకమైన భావం ఏర్పడుతుంది. తన పని పట్ల తనకే ఒక విధమైన ఏహ్యమైన భావం కలుగుతుంది. నేనెందుకు ఎప్పుడూ  ఈ 'పనే' చేయాలి అనే భావాన్ని అతను ఏర్పరుచుకుంటాడు. అప్పటివరకు అతని ఆలోచనా పరిధిలో లేనటువంటి ఒక వేరే విధమైన ఆలోచన తన మది ని తాకుతుంది. తను చేస్తున్న పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందా? ఆ ఆలోచన మొదలైనప్పటి నుండి అతని మనసు పని మీద తక్కువ ద్రుష్టి నిలుపుతుంది. కొన్ని సార్లు అతన్ని సోమరితనం ఆవహిస్తుంది.

అతని మనసులో ఆలోచనా బీజం పడేలా చేసే విష్యం ఏంటంటే...  "తన పనికి తగ్గ గుర్తింపు"  అదిగో అక్కడే యజమాని కి ఉద్యోగికి అంతరాలు అలలై ఎగసిపడతాయి. యజమాని తన ఉద్యోగి నుండి ఎంత పని రాబట్టుకున్ననూ .., ఆ పనిలో.., 'ఎంతవరకు' సంస్థకు ఉపయోగపడిందనే చూస్తాడు. ఆ ఉద్యోగి ఇంకా ఎం పని చేయగలడు.., ఎలా చేయగలడు.., ఎంతవరకు చేయగలడు.., ఆ చేసిన పనిని సంస్థకు.., సమర్థవంతంగా ఎలా ఉపయోగించగలడు అనే ఆలోచన యజమాని హృదయాంతరాల్లో చిక్కదు. అక్కడే ఆ ఉద్యోగికి యజమాని కి మనస్పర్థలు ఏర్పడి సంస్థను ప్రభావితం చేస్తుంది. యజమాని వైపు మనం ఆలోచించినపుడు యజమాని యొక్క ఆలోచనా ధోరణి కూడా సరైయినదే అన్న అభిప్రాయం కలుగక మానదు. ఎందుకంటే యజమాని తన సంస్థను ముందుకు తీసుకెళ్లాలన్న జిజ్ఞాస లోనే ఉంటాడు అందుకే తను ఉద్యోగులతో  ఎం పని అవుతుంది, ఎలా పని అవుతుంది, ఎంతవరకు అవుతుంది ఆలోచిస్తాడు తప్ప..., ఆ పనిలో ఎంత నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యానికి ఉద్యోగి శ్రమ ఎలా తోడైంది అనే ఆలోచన ఉండదు. అలా ఉన్న సంస్థ, ఆ సంస్థ యజమానీ ఖచ్చితంగా దిగ్విజయాల బాట పడతారు.

ఇక్కడే ఒక అంశం దాగి ఉంటుంది. అదే "సృజనాత్మకత" కొత్తగా ఉంటుంది పదం కాని ప్రయత్నిస్తే కూడా అంతే సరికొత్తఃగా ఉంటుంది. ఉద్యోగి నైపుణ్యాన్ని గుర్తెరిగిన సంస్థ...,  ఆ ఉద్యోగి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవటం లోనే తన అధికారాలు ఉపయోగిస్తాడు యజమాని.., కాని ఆ ఉద్యోగికి స్వేచ్చ.., స్వతంత్రాన్ని ఆపాదించి ఆ వ్యక్తి "సృజనాత్మకతను" బయటకి తీయగలిగితే.., ఇంక ఆ ఉద్యోగి పనితనానికే కొత్త సొబగులు అద్దుతాడు. అలా తీయగలిగిన సంస్థ ఎదుగుదలకు ఇంక అడ్డే ఉండదు. కాని యజమానికి ఆ ఉద్యోగి సృజనాత్మకత కన్నా అతని నైపుణ్యం పైనే ఎక్కువగా ఆధార పడతాడు. దాని వల్లే.., అందుకే..,, ఏది కూడా కొత్తగా కనిపించటానికి ఏ సంస్థ కూడా కృషి చేయదు.

అందుకే ఒక్క విషయం ఎవరైనా గుర్తించారో లేదో ప్రపంచం లో ప్రతి నూతన వస్తువు తయారీలో మన భారత దేశం 154 స్థానం లో ఉండటం నిజంగా మన దురదృష్టకరం. ఈ విషయంలో గత రెండు సంవత్సరాలుగా జపాన్ అగ్ర స్థానం లో కొనసాగుతుంది. అందుకే ఇటీవల మన దేశ ప్రధాన మంత్రి స్వయంగా జపాన్ ప్రజలని చూసి మనం నేర్చుకోవాల్సి చాలా ఉందని వ్యాఖ్యానించటం గమనార్హం. అలాగని మనం వాళ్ళని చూసి నేర్చుకోవటం కన్నా మనం 'ఇంకా ఎం చేయగలం' అని ఆలోచించినప్పుడే మనం ఇతరులకు కొత్తగా చూపించగలం.... అప్పుడే ఉద్యోగి సమర్థత బాహ్య ప్రపంచానికి తేటతెల్లం చేస్తుంది.

కాని కొందరు ఉద్యోగులు తమ నుండి కంపెనీ ఆశిస్తున్న పనిని కూడా సమర్థంగా పోషించరు. దాని వల్ల ఆ ఉద్యోగి ఉద్వాసనకు గురవ్వక తప్పదు. ఆ సమయంలో ఉద్యోగి ఒక్కటే గుర్తించాలి మనమెప్పుడు కాపీరైట్ లకు వేదిక కాకూడదు మన క్రియేటివిటీకి వేదిక కావాలి. కాని కొన్ని సమయాల్లో ఆ ఉద్యోగి నుండి సరైన పనిని రాబట్టుకోలేని యజమాని పాత్రని కూడా మనం తప్పు పట్టలేకుండా ఉండలేము...!! ఎందుకంటే ఆ ఉద్యోగి సమర్థతను "సక్రమంగా" వెలికితీసినప్పుడే యజమాని సమర్థత తెలుస్తుంది. యజమాని ఉద్యోగి నుండి ఎం ఆశించడు అసలు అతనికి సృజనాత్మకత అనే పదమే కొత్తగా అనిపించచ్చు. ఆయనకు కావాల్సింది కేవలం పని.... ఉద్యోగి చేసిన పనిని, పని వేగాన్ని పరిగణలోకి తీసుకుంటాడు తప్ప  పనిలో నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోడు ముఖ్యంగా ఇది ఇప్పుడు భారత దేశం లో ఇదొక తీవ్ర సమస్య గా మారింది.

ఇంక ఉద్యోగి తన నైపుణ్యాన్ని, ఆలోచనలకు పదును పెట్టి తన సంస్థకు ఇంకా... ఏ విధంగా తన పనిని సక్రమంగా, సమర్థవంతంగా అందించగలడో ఆలోచిస్తాడు. కాని అదే సమయం లో ఒక యజమాని నుండి ప్రోత్సాహం అందినప్పుడే ఆ ఉద్యోగి తన నైపుణ్యానికి పదును పెట్టగలడు. ఆ నైపుణ్యం నుండి సృజనాత్మకతను వెలికి తీయగలడు. ఆ సృజనాత్మకత సంస్థను ఈ సృష్టి మొత్తానికే తిరుగులేని సూపర్ శక్తి గా అవతరింప జేస్తుంది. ఆ ఉద్యోగి సృజనాత్మతను వెలికి తీసే సమర్థత గల యజమాని ఉన్నప్పుడు ఆ సంస్థ ఆకాశమే హద్దుగ అవనంతరాలను దాటగలుగుతుంది. ఏ ఉద్యోగైనా ఒక యజమాని నుండి కోరుకునేది...., తనకు గౌరవం, తన పనికి తగిన గుర్తింపు... యజమాని తన ఉద్యోగిలో వీటిని గుర్తించినప్పుడు ఏ సంస్థ కూడా నష్టం అనే పదం దరికి రానివ్వదు.   ఏ ఉద్యోగైనా., ఏ యజమానైనా అంతిమంగా సంస్థ కోసమే పని చేసేది కాని ఆ సంస్థ "ఉన్నదాన్నే" మరింత బాగా.., మరింత వేగంగా చేయటానికి ప్రయత్నిస్తుందా? లేదా ఒక సరి క్రొత్త ఆవిష్కరణకు వేదికవుతుందా?? అనే విషయన్ని ఒక్కసారి యజమాని ఆలోచించినప్పుడు మన దేశం సృజనాత్మకత అనే పదానికి క్రొత్త అర్దాన్నిచ్చి నవనూతన నిత్యావిష్కరణలతో ఈ దేశం ప్రపంచంలోనే అగ్ర దేశంగా.., అన్ని దేశాలు అసూయ పడి "మనల్ని చూసే" విధంగా త్వరలోనే రూపాంతరం చెందుతుంది.  ఒక టాటా,  ఒక విప్రో,  ఒక ఐ.సి.ఐ.సి.ఐ, ఒక జీ.ఎం.ఆర్ సంస్థల స్పూర్తిగా.....

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles