Personal information hacking safety tips

personal information hacking, safety tips from hackers, hacking tips and tricks, information hacking tips, hacking safety tips, how to secure from hackers, hacking programmes and softwares, latest technology updates

personal information hacking safety tips : be safe and secured from hacking personal information from hackers by using these simple tips and suggetions, with some of tips and tricks people can be saved their personal information from hackers

హ్యకింగ్ బారినుంచి తప్పించుకోండిలా...

Posted: 12/16/2014 11:20 PM IST
Personal information hacking safety tips

ప్రస్తుత ఆన్ లైన్ ప్రపంచంలో.., ప్రతి పనీ ఇంటర్ నెట్ ద్వారా చేయటం సాధారణమైంది. ఇంటి విద్యుత్ బిల్లు మొదలుకుని.., సమాచారం పంచుకోవటం.., ఉద్యోగాలు చేయటం కూడా ఆన్ లైన్ మయం అయింది. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అంతగానే ఉన్నాయి. అందులో ప్రధానమైనది హ్యాకింగ్. ఆన్ లైన్ కార్యకలాపాలకు ప్రధాన అడ్డంకిగా మారిందీ హ్యాకింగ్. ముఖ్యంగా ఆన్ లైన్ ఆర్దిక లావాదేవీలు, సమాచారం ప్రధాన లక్ష్యంగా హ్యాకర్లు తెగబడుతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. క్షణాల్లో మన సమాచారం వారి చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేము. అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటించటం ద్వారా హ్యాకింగ్ బారి నుంచి తప్పించుకోవచ్చు.

* ఆన్ లైన్ లో మీ, మీ పిల్లల సమాచారం భద్రతపై ఎప్పటిప్పుడు నిఘా పెట్టండి. లావాదేవీలతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డులు పాస్ వర్డ్స్, అకౌంట్ వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకొండి.
* ఉపయోగం లేని అకౌంట్ వివరాలు, క్రెడిట్ ఆఫర్ల తాలూకు పత్రాలను దాచుకోవటం మంచిది కాదు. వాటి వల్ల ఇతర అకౌంట్ల సమాచారం సేకరించే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తొలగించండి.
* క్రెడిట్ కార్డు బిల్లులు ప్రతి నెలా తప్పనిసరిగా పరిశీలించండి. అవసరమనుకుంటే ఏడాది వారిగా క్రెడిట్ కార్డు బిల్లులు తీసుకొండి. దీని వల్ల ఖర్చుల లెక్కలు తెలియటంతో పాటు, మనకు తెలియని ఖర్చులు జరిగాయా అనే లెక్క తేల్చవచ్చు.

వీటితో పాటు ఇతర టిప్స్ పాటించటం ద్వారా సమాచారం చోరీ కాకుండా జాగ్రత్తపడవచ్చు. అన్ని జాగ్రత్తలు పాటించినా.., సమాచారం చోరి అయిందంటే వెంటనే జాగ్రత్త పడాల్సిన అవసరముంది. కార్డు సమాచారం చోరి అయిందని గుర్తిస్తే వెంటనే బోగస్ అకౌంట్ మూసివేయాల్సిందిగా సంబంధిత క్రెడిట్ కార్డు నిర్వాహకులకు సమాచారం ఇవ్వాలి. అకౌంట్ రికార్డులు తీసుకుని పరిశీలించి.., తప్పుడు సమాచారం ఉంటే వెంటనే తొలగించాలని బ్యాంకులను కోరాలి. లోన్ కోసం దరఖాస్తు చేసే ప్రతి సారి కొత్త అకౌంట్ తెరవటం ఉత్తమం. అకౌంట్ రిపోర్టులను www.consumer.ftc.gov వెబ్ సైట్ లో నమోదు చేయవచ్చు. బిల్లులకు సంబంధించిన కాపీలన్ని జాగ్రత్తగా ఉంచుకోవటంతో పాటు, మెయిల్ కు వచ్చే సందేశాలు కూడా జాగ్రత్తగా ఉంచటం వల్ల చోరీ నుంచి ఊరట పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : personal information hacking  hacking tips  latest updates  

Other Articles