పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న ఆరోపణ లతో ముగ్గురు తెలుగు దేశం పార్టీ ఎం ఎల్ ఏ లకు తెలంగాణ అస్సెంబ్లీ స్పీకర్ మధుసూధనా చారి గారు నోటీసు లు జారి చేశారు. ఇదివరకే నలుగురు శాసన సభ్యులకు ఫిరాయింపుల నోటీసు లు అందజేసారు.. ఈ మొత్తం సంఖ్య ఏడు కి చేరింది. తాజాగా నోటీసు లు అందుకున్న వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్), తీగల కృష్ణా రెడ్డి (మహేశ్వరం ), చల్ల ధర్మా రెడ్డి (పరకాల) ఉన్నారు. వీరు ఇటీవలే కెసిఆర్ సమక్షం లో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు వలస వెళ్లిన రెడ్యానాయక్ (డోర్నకల్), విఠల్‌రెడ్డి (ముధోల్), కె.కనకయ్య (ఇల్లెందు) ఇప్పటికే నోటీసులు అందుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్ (వైరా)కు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
వీళ్ళే కాక ఇంకా మరి కొందరు ఎం ఎల్ ఏ లు టి ఆర్ ఎస్ పార్టీ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. కాని వెంట వెంటనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే పార్టీలో అంతర్గతంగా తలెత్తే అసంతృప్తి, బయటనుంచి వచ్చే విమర్శలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా వలసలను నిలుపు చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. ఇపుడే చేర్చుకుంటే ఆ నియోజక వర్గ భాద్యులుగా ఉన్న టి ఆర్ ఎస్ నేతల్లో అసంతృప్తి భగ్గు మంటుందన్న యోచన తోనే ఆ నేతలకు ఇప్పుడప్పుడే వద్దని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం స్పీకర్ ఇచ్చిన ఈ తాకీదులపై ఎం.ఎల్.ఏ లు ఎం జవాబు ఇస్తారో చూడాలి మరి...!!
హరి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more