Ys jagan open letter to ap cm sri chandra babu naidu

ys jagan open letter, ys jagan, chandra babu naidu, ysr congress, andhra pradesh oposition leader open letter to cm, tdp

ys jagan wrote a open letter to ap cm sri chandra babu naidu to bring one website to show budget files

వై ఎస్ జగన్ లేఖాస్త్రం

Posted: 12/09/2014 04:22 PM IST
Ys jagan open letter to ap cm sri chandra babu naidu

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ  చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నేత శ్రీ వై ఎస్ జగన్ లేఖ రాసారు. ప్రభుత్వ ఆదాయవ్యయాల లెక్కలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ప్రతి పైసా ప్రజలకు ఏ విధంగా ఖర్చు అవుతుందో చూపించాలని కోరారు. కోరటమే కాదు ఈ విధానం కేంద్రం తో పాటు పలు  రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, అందుకు ఉదాహారణగా పక్క రాష్ట్రమైన తెలంగాణానూ ఉదహరించారు.

బడ్జెట్ లెక్కలపై కేంద్రం మరియు వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతినే ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పుడే పారదర్శకత తో కూడిన పాలన ప్రజలకు అందుతుందన్నారు. తమ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఒక వెబ్ సైట్  ద్వారా ప్రజలకు ప్రభుత్వ ఆదాయ వ్యయాల సంబంధిత  లెక్కలను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటె ప్రతిపక్ష నేత రాసిన ఈ  లేఖకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి స్పందన ఇస్తుందో  చూడాలి..!!  

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysr congress  ys jagan  chandra babu naidu  tdp  

Other Articles