Conistable and home guard raped a young girl in guntur district

rape, constable, home guard, Young girl, guntur district, sumoto case, identify victim, complaint, cc camera footage, Arrest, SI, SP Rajaesh Kumar

conistable and Home guard raped a young girl in guntur district

ఆలస్యంగా వెలుగుచూసిన ‘కాకీ’ల కీచకపర్వం..

Posted: 12/03/2014 01:30 PM IST
Conistable and home guard raped a young girl in guntur district

అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరగగలినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్య వచ్చినట్లు అని జాతిపిత మహాత్మ గాంధీజీ అన్న వ్యాఖ్యలు సగటు భారతీయుడిగా వారికి గుర్తుకు రాలేదు. అది కాక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన స్థానంలో వున్నామన్న విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. రాత్రి సమయంలో అసాంఘిక శక్తులు, దోంగలు, పోకిరీలు ఇలా ఎవరి నుంచి ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత వున్న రక్షణ భటులే భక్షక భటులయ్యారు. ఆ యువతికి నరకం చూపించారు. ప్రజా రక్షకులే తనను అత్యాచారం చేశారని ఎవరికి చెప్పాలో తెలియక.. ఆ అమాయక యువతి పడిన మనోవేధన చెప్పనలవి కాదు. రాత్రి గస్తీ తిరుగుతూ ఓ యువతిని లోబరుచుకుని అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. నిర్భయ తరహాలో జరిగిన ఈ సంఘటనకు బాధ్యుడు పోలీసు కానిస్టేబుల్, హోంగార్డులే కావడం చర్చనీయూంశమైంది. యువతికి తోడుగా ఉన్న యువకుడిని తరిమేసి... పోలీసు కామవాంఛ తీర్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే సోమవారం అర్ధరాత్రి ఓ యువకుడు, యువతి పొత్తూరువారితోటలో నడిచి వెళ్తుండగా, రాత్రి గస్తీలో ఉన్న ఓ కానిస్టేబుల్, హోంగార్డు వారిని ఆపి విచారించారు. యువకుడిని బెదిరించి పంపించివేసి అనంతరం ఆ యువతిని భయపెట్టి లొంగదీసుకున్నారు. నంద్యాలకు చెందిన అమ్మాయికి ఇక్కడేం పని.. కేవలం వ్యభిచారం చేయడానికి ఇక్కడకు వచ్చాంటూ ఆ యువతని లొంగదీసుకున్నారు. మామూలుగానే చిన్న తప్పుపై పోలీసు స్టేషన్ కు వెళ్తే.. పోలీసుల నోటి నుండి జాలువారే సంస్కృతాన్ని తట్టుకోవడం కష్టం అలాంటిది ఒంటరిగా అమ్మాయి దోరికితే.. తాము పోలీస్.. అందుకనే రక్షణ కల్పిస్తామని చెప్పాల్సింది పోయి.. కీచకుల్లా యువతిపైబడి అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, సీసీ కెమెరా పుటేజ్‌లో.. సంఘటన జరిగిన సమీపంలోని ఓ కార్యాలయం వెలుపల ఉన్న సీసీ కెమెరాలో కానిస్టేబుల్, హోంగార్డు యువకుడు, యువతిని బెదిరిస్తోన్న సంఘటన రికార్డు అయింది. ఈ పుటేజ్‌ను పోలీసులు సేకరించారు. విచారణను వేగవంతం చేశారు.

ఈ ఘటనపై సమాచారం తెలియగానే అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. ఎస్‌హెచ్‌వో సెలవులో ఉండడంతో విచారణ చేపట్టాల్సిందిగా ఇద్దరు ఎస్‌ఐలను ఎస్పీ రాజేష్‌కుమార్.. ఆదేశించారు. ఆ మేరకు ఎస్‌ఐలు విచారణ జరిపి రాత్రి గస్తీలో ఉన్న సిబ్బందిని విచారించి ఇద్దరు కానిస్టేబుళ్లలో ఎవరన్నదీ నిర్థారణకు వచ్చారు. అయితే బాధితురాలి నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్పీకి నివేదించారు. అయినా ఎస్పీ స్టేషన్ సిబ్బంది ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్‌ఐలు ఇద్దరినీ తన కార్యాలయానికి పిలిపించుకుని సంఘటనా పూర్వాపరాలపై విచారించారు. బాధిత యువతి నంద్యాల వాసి అని తెలుసుకున్న ఎస్పీ రాజేష్‌కుమార్.. ఆమె చిరునామా తెలుసుకుని ఫిర్యాదు తీసుకోవాలని ఎస్‌ఐలను ఆదేశించారు. అందుకోసం ఇద్దరు సిబ్బందిని నంద్యాలకు పంపాలని ఆదేశించినట్లు సమాచారం. సిబ్బంది పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పోలీసుల కీచకపర్వం వెలుగులోకి రావడంతో నగర ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి వేళ అసాంఘిక శక్తులను గుర్తించి నియంత్రించాల్సిన వారే అమాయక యువతులను టార్గెట్ చేసి అత్యాచారానికి పాల్పడుతున్నారని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నడిబొడ్డులో ఆస్పత్రులు, ప్రధాన కార్యాలయాలు, పోలీసుస్టేషన్‌కు కొద్దిదూరంలోనే ఉన్న ప్రాంతంలోనే బాధితురాలికి అన్యాయం జరగడం పోలీసుల నైతిక ప్రవర్తనకు అపఖ్యాతి తెచ్చేలావుందని విమర్శలు వస్తున్నాయి. పొత్తూరువారితోట మెయిన్‌రోడ్డులో నడిచివెళుతున్న ఓ యువతిని రాత్రి గస్తీలో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డు బెదిరించి అత్యాచారం చేశారన్న వార్తపై అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ కన్నెర్ర చేశారు.

బాధితురాలి ఫిర్యాదు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఒకవేళ బాధితురాలు ఫిర్యాదు ఇవ్వకుంటే సుమోటోగా కేసు నమోదు చేయాలని సూచించారు. సంఘటన జరిగిన సమీపంలోని ఓ కార్యాలయం వెలుపల ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఈ సాయంత్రానికి అరెస్ట్ చేసే అవకాశముంది. ఈ వ్యవహారంలో రాజీ కుదిర్చిన కొత్తపేట ఎస్సై కూడా చర్య తీసుకునే అవకాశముంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles