Cbi director ranjit sinha retires says he has done no good work

Ranjit Sinha, CBI Director, retirement, Central Bureau of Investigation, CBI, coal scam, 2G scam, Supreme court, tumultuous tenure, criticism, bribery cases

I am not going to say anything. I have done no good work. Write what you want to write. Enough dirt has been thrown upon me," he shot back at reporters who had asked him to sum up his tenure in CBI.

అంతా చేసి.. మీడియాపై అలకబూనిన అయ్యవారు..

Posted: 12/02/2014 11:48 AM IST
Cbi director ranjit sinha retires says he has done no good work

సీబీఐ డైరెక్టర్‌గా ఇవాళ పదవీవిరమణ చేయనున్న రంజిత్‌ సిన్హా స్టయిలే వేరు! చేయాల్సిందా తానే చేసేసి.. చివరకు మీడియాపై అలకబూనారు. ఏదడిగినా.. చిన్న పిల్లవాడి తరహాలో సమాధానం ఇచ్చాడు. ఆయన పదవీ విరమణ సందర్భంగా ఆయనను మీడియా అడిగిన ప్రశ్నలపై నేను ఏం చేయలదని గత రెండుళ్లుగా రాస్తున్నారుగా అన్నారు. గత రెండేళ్లుగా తానే మంచి పనీ చేయలేదని ఆయనే చెప్పుకున్నారు. ఉద్యోగరీత్యా ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారని విలేకరులు ప్రశ్నించగా ‘‘అసలు నేనేమీ చెప్పదలచుకోలేదు. నేనే మంచి పనీ చేయలేదు. మీకిష్టమొచ్చినట్లు రాసుకోండి! అంటూ కస్సుమన్నారు.

గత రెండేళ్లుగా నా పరువుపోయేలా మీ పత్రికల వాళ్లు వార్తలు రాశారు. టీవీ ఛానల్స్‌లో చూపారు’’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. దీంతో మీడియా అంతా అవాక్కయ్యారు. ఇంతలో ఒక విలేకరి, ‘‘మీరు కూడా మాజీ కాగ్‌ వినోద్‌ రాయ్‌, కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరఖ్‌ మాదిరిగా పదవీ విరమణ తర్వాత పుస్తకం రాస్తారా’’ అని ప్రశ్నించగా....దానికి కూడా విచిత్రంగా సమాధానమిచ్చారు. ‘‘నేనేం చేయాలో అది చేస్తా. వారిని అనుసరించను’’ అని సిన్హా చెప్పారు. అయితే సాక్షాత్తు సర్వోతన్నత న్యాయాస్థానం సుప్రీంకోర్టే అయ్యవారికి అక్షింతలు వేసిన విషయాన్ని మర్చిపోయారు. ఇదంతా కేవలం మీడియా సృష్టే అన్నట్లు మండిపడుతున్నారు.

కాగా రంజిత్ సిన్హా హయాంలో కేంద్ర మాజీ రైల్వేశాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మేనల్లుడు ఓ అధికారికి రైల్వే డైరెక్టర్ పదవిని కట్టబెట్టేందుకు తీసుకున్న కేసును బట్టబయలు చేశారు. సుమారు 90 లక్షల రూపాయల నగదుతో పాటు రెడ్ హ్యండెడ్ గా ఆయన ఈ కేసును బట్టబయలు చేశారు. అంతేకాదు పబ్లిక్ సెక్టార్ బాండ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సెన్సార్ బోర్డు ఎగ్జిక్యూటివ్ అధికారి లంచాల బాగోతాలను సిన్హా నేత్వత్వంలోని అధికారులు బట్టబయలు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles