పశ్చిమ బెంగాల్ లోని బర్ద్వాన్ లో జరిగిన పేలుళ్ల కేసులో మరో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుర్డ్వాన్ కేసును సంయుక్తంగా తొవ్వుతున్న బంగ్లాదేశ్, భారత్ పోలీసులు మయన్మార్ కు చెందిన ముగ్గురు ఉద్రవాదులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంగ్లాదేశ్ లో తిష్టవేసి.. భారత్ లో పేలుళ్లకు కారణమవుతున్న వారిపై బంగ్లాదేశ్ పోలీసులతో కలసి భారత్ పోలీసులు పనిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిన్గ్య సాలిటరీ ఉగ్రవాద సంస్థకు చెదిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దును కేంద్రంగా చేసుకుని కుట్రలకు పాల్పడుతున్న జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ కు చెందిన మరో 100 మంది ఉగ్రవాదులను పోలీసుల జాయింట్ అపరేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. మయన్మార్ కు చెందిన రోహిన్గ్య సంఘీభావ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని వాచరిస్తున్నట్లు ఢాఖా మెట్రోపాలిటన్ పోలీస్ ఢిఫ్యూటీ కమీషనర్ క్రిష్ణ పాదారాయ్ తెలిపారు. వారి వద్ద నుంచి 500 కేజీల పేలుడు సామాగ్రితో పాటు రెండు జిలిటిన్ అనుసంధాన బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఉగ్రవాదులు భారత్ కు వెళ్లారా..? లేదా అన్న అంశంమై తన వద్ద సమాచారం లేదన్నారు. వీరికి బర్డ్వాన్ బాంబు పేలుళ్లకు దగ్గర సంబంధాలు వున్నాయిని తాము అనుమానిస్తున్నాట్లు చెప్పారు. మయన్మార్ నుంచి అక్రమంగా బంగ్లాదేశ్ లోని చోరబడిని వీరిపై ముందుగా కేసు నమోదు చేశామని తెలిపారు. అంతేకాకుండా శీరు రోహిన్గ్య ఉగ్రవాద సంస్థ సభ్యులని ఆయన నిర్ధారించారు. నిందితులు ముగ్గురూ మదర్సాలలో విద్యను అభ్యసిస్తున్నట్లు పైకి నటించినా.. వారు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తమ దర్యాప్తులో తేలిందన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more