Minors girls pointed to pornography and raped

minors girls, raped, pointed, pornography, langer house, mailardevpalli, police, arrest, remand, critical, treatment, hospital, autodriver, dumpyard owner

minors girls pointed to pornography and raped

బ్లూఫిల్మ్ చూపించి మైనర్ల అమ్మాయిలపై అత్యాచారం..

Posted: 11/09/2014 05:01 PM IST
Minors girls pointed to pornography and raped

అభం శుభం తెలియని అమాయకురాళ్లైన ఇద్దరు చిన్నారులపై మదమృగాలు మాటువేశాయి. వారిని మాయమాటలతో నమ్మించి పశువాంఛ తీర్చుకున్నాయి. చనువుగా ఉండటాన్ని ఆసరాగా చేసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు. పసిమొగ్గలకు నీలి చిత్రాలు చూపించి మరీ దారుణానికి ఒడిగ్టారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు. ఆడవారిని వేధించే వారి కళ్లను పీకుతామని చెప్పిన ముఖ్యమంత్రి త్వరతగతిని కఠిన చర్యలకు ఉపక్రమించకపోతే.. ఈ దారుణాలు విశృంఖలంగా పెరిగిపోయి.. హైదరాబాద్‌ కూడా మరో బెంగళూరు మాదిరిగా తరయారవుతుందన్న ఆందోళన తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. లంగర్‌హౌస్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసు ఠాణాల పరిధిలో జరిగిన వేర్వేరు ఘటనలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.

కూతురి వయస్సున్న ఏడేళ్ల పసిపాప పైన మృగవాంఛ

లంగర్‌హౌస్ పోలీసు ఠాణా పరిధిలో ఉండే ఆజం(35) మూసాపేటలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. గతంలో అతడు ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే మరో ఆటో డ్రైవర్‌తో సన్నిహితంగా ఉండేవాడు. అప్పుడే అతని కూతురుపై మృగాడి కన్ను పడింది. పదిరోజుల క్రితం ఆ ఆటోడ్రైవర్, ఆయన భార్య బయటకు వెళ్లడం గమనించిన ఆజం...వారి ఇంటికి వెళ్లాడు. తాను ఊహించినట్టు ఆటోడ్రైవర్ కుమార్తె(7), బాలిక తమ్ముడు ఇంట్లోనే ఉన్నారు. చాక్లెట్లు తీసుకురావాలంటూ బాలిక తమ్ముడికి డబ్బులిచ్చి బయటకు పంపించాడు.

తనలోని మదమృగం భయటకు వచ్చింది. అంతే పసిపాపకు. సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూపించి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు.. విషయం బయటకు పొక్కితే తమ పరువు పోతుందని భయపడ్డారు. వేరే ప్రాంతానికి తరలించి చికిత్సలు అందించారు. పాప పరిస్థితి విషమంగా ఉండడంతో చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మనమరాలి వయస్సు అమ్మాయిపైనా పశువాంఛ

మరో ఘటనలో తన మనవరాలి వయస్సున్న పదకొండేళ్ల బాలికపై కామాంధుడు పాశవిక చర్యకు పాల్పడ్డాడు. మాయమాటలతో నమ్మించి అత్యాచారం చేశాడు యాభైఏళ్ల ప్రబుద్ధుడు.  మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్ జావెద్ కథనం ప్రకారం... మైలార్ దేవ్‌పల్లిలోని చెత్తగోదాం యజమాని అన్వర్‌ఖాన్(50) రోజూ గోదాంలో పని కోసం రోజు రాత్రి 9 గంటల వరకూ గోదాంలోనే ఉండేవాడు. గోదాంలో పనిచేస్తూ సమీపంలోనే నివాసముండే ఓ మహిళ తన పదకొండేళ్ల కూతురును ఇంటి వద్ద ఒంటరిగా వదిలి రాలేక.. తనతో పాటే గోదాంలో తీసుకువచ్చేది.

తల్లితో పాటు అక్కడికి వెళ్లే బాలిక.. అన్వర్‌ఖాన్ గదిలో టీవీ చూసేది. దీనినే ఆసరాగా చేసుకున్న ఆ మనవ మృగం.. మదిలో కామవాంఛ రేగింది. యధావిధిగా తన గదికి వచ్చిన అమ్మాయిని, తన మనమరాలి వయస్సుదని కూడా చూడకుండా.. నీలి చిత్రాలు చూపిస్తూ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంటికి వచ్చిన తన కూతరు జరిగిన విషయం తల్లిదండ్రులతో చెప్పడంతో.. ఆగ్రహంతో అన్వర్‌ఖాన్ గదికి వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అన్వర్‌ఖాన్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles