Women drives 10 wheeler lorry for her family survival

women, driver, 10 wheeler lorry, family survival, highways, 12 years, daughter, Engineering, son, Intermediate, Bhopal, bangalore, chittor, madanpalli, odisha, tomato load

women drives 10 wheeler lorry for her family survival

బతుకు జట్కాబండి కాదు.. లారీ స్వారీ అంటున్న యోగిత..

Posted: 11/09/2014 12:41 PM IST
Women drives 10 wheeler lorry for her family survival

మనం ఏదైనా వస్తువును కోల్పేతే.. అయ్యో పోయిందే అంటూ బాధపడతాం. కాని విధి వంచించడంతో తన జీవిత భాగస్వామినే కోల్పోయిన అమె.. బాధ పడింది. అలా అని నిశ్ఛేష్టురాలిలా కూర్చోలేదు. తన కుటుంబానికి తానే ఆధారం కావాలని కంకణం కట్టుకుంది. తన భర్త తనకు నేర్పించిన విద్యనే ఆధారంగా చేసుకుని బతుకు బండిని నడుపుతోంది. తన కుటుంబాన్ని అన్ని విధాలా.. ఆదుకుంటూ.. ఎవరికీ ఏలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇంతకీ ఎవరి గురించి చెబుతున్నామనేగా..?

నారీమణులు.. లారీని నడపడమంటే మాటలు కాదు. లారీ అంటే అదేదో ఆరు చక్రాల లారీ అనుకునేరు. కాదు భారీ లారీ. పది చక్రాల లారీ. దీన్ని నడపడమంటే పురుష పుంగములకే చాలా కష్టం. అలాంటిది ఈ చిత్రంలో కనిపిస్తున్న భోపాల్‌కు చెందిన యోగిత నిత్యం పది చక్రాల భారీ లారీని నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా.. ఎన్ని వందల మైళ్ల దూరమైనా ఒంటరిగానే లారీని నడుపుకొంటూ వెళ్తూ తన సాహసంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

2003లో భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబ పోషణార్థం ఆమె ఈ తన భర్త నేర్పించి.. ఆచరించిన బాటనే ఎంచుకున్నారు. తాను లారీనే నడపాలని అనుకుని నిర్ణయించుకున్నారు. తన భర్త నేర్పిన శిక్షణతో భారీ వాహనాలు నడిపే లైసెన్సులను పొందారు. ఇంకెందుకు ఆలస్యం అనుకుందో ఏమో.. లారీని నడుపుతూ వేల కిలోమీటర్ల దూరం సాగిపోతూనే వున్నారు. ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచాయని వెనక్కు తిరిగి చూసే సరకి 12 ఏళ్లు గడిచిపోయాయి. 12 ఏళ్లుగా ఆమె లారీని నడుపుతూనే వున్నారు.

యోగిత న్యాయశాస్త్రంలో పట్టాను సాధించినా.. తన భర్తనే ఆదర్శంగా తీసుకుని లారీ స్వారీని ఎంచుకున్నారు. తన కూతురు, కోడుకులతో పాటు అత్త,మామల అవసరాలను తీర్చుతూ.. ముందుకు సాగిపోతోంది. భోపాల్ నుంచి బెంగళూరుకు లోడు తీసుకొచ్చిన ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి ఒరిస్సాలోని బరంపూర్‌కు టమోటాల లోడు తీసుకెళ్తూ.. ఇలా మీడియా కంటబడ్డారు. అప్పడు క్లిక్ మనిపించిన ఫోటోనే ఇది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles