Narendra modi may move sadananda gowda out of railways over non performance son karthik controversy

Prime Minister, Narendra modi, sadananda gowda, railways, non performance, son, karthik gowda, controversy, cabinet expansion, bjp, shiv sena, demotion, Railway Ministry

narendra modi may move sadananda gowda out of railways over non performance son karthik controversy

సదానంద గౌడకు డిమోషన్..? పనితీరే కారణమా..?

Posted: 11/08/2014 06:04 PM IST
Narendra modi may move sadananda gowda out of railways over non performance son karthik controversy

కేంద్ర కేబినెట్ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తొలి వంద రోజుల పనితీరు ఆధారంగా కొంతమంది మంత్రుల శాఖలను మార్చి, కొంతమందిని కేబినెట్‌ నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడకు శాఖ తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పనితీరుపై మోదీ అసంతృప్తిగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సదానంద కుమారుడు కార్తీక్ వివాదం కూడా ఆయన శాఖ మార్పుకు కారణంగా వార్తలు వినబడుతున్నాయి. తాజాగా నూతన రైల్వేశాఖ మంత్రిగా శివసేనకు కేటాయించనున్న నేపథ్యంలో సదానందగౌడ శాఖ నుంచి బదిలీ చేయడం అనివార్యమన్న కథనాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శివసేన కూడా రైల్వే శాఖను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీకి చెందిన సురేష్ ప్రభుకు కేంద్ర రైల్వే శాఖ పగ్గాలు కట్టబెట్టనున్నట్లు సమాచారం.

రేపు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మొత్తం 10 నుంచి 11మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అలాగే బీజేపీ నుంచి పలువురు కొత్త ముఖాలతో పాటు మిత్ర పక్షాలైన శివసేన, టీడీపీకి కూడా కేబినెట్‌లో చోటు దక్కనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోవా సీఎం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

బీజేపీ తరఫున పంజాబ్ నుంచి తొలిసారి నెగ్గిన విజయ్ సాంప్లా, సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ సిన్హా, హర్యానా నుంచి జాట్ నేత బీరేందర్‌సింగ్, బీహార్ నుంచి గిరిరాజ్‌సింగ్ లేదా భోలా సింగ్, రాజ్‌స్థాన్ నుంచి కల్నల్ సోనారామ్ చౌదరీ, గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ర్ట నుంచి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ, శివసేన నుంచి సురేష్ ప్రభు, అనిల్ దేశాయ్కి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. అలాగే టీడీపీ నుంచి సుజనా చౌదరికి, బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయకు చోటు దక్కింది. కాగా నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్లకు కేబినెట్ హోదా దక్కనున్నట్లు సమాచారం. కొత్తగా కేబినెట్‌లో చేరనున్న వారికి.. మోదీ ఇచ్చే టీ విందుకు రావాలని పీఎంఓ ఫోన్ ద్వరా సమాచారం అందించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles