Nara lokesh babymoon tour with brahmani to america

nara lokesh baby moon tour, nara lokesh baby moon, lokesh brahmani baby moon, lokesh brahmani photos, lokesh latest comments, baby moon tour spots, baby moon tour best spots places, best tourism places in the world, latest news

nara lokesh babymoon tour with bramhani to america : tdp leader nara lokesh going to baby moon tour with his wife bramhani to america. nara lokesh and bramhani going for baby moon tour to america

పిల్ల చంద్రుడి కోసం చినబాబు పయనం

Posted: 11/08/2014 10:00 PM IST
Nara lokesh babymoon tour with brahmani to america

టైటిల్ వినడానికి కాస్త వెరైటీగా ఉంది కానీ.., ఇంగ్లీషు పదాలను యదావిధిగా తెలుగులోకి తర్జుమా చేస్తే ఇలాగే అర్ధం వస్తుంది. ఇక విషయం ఏమిటంటే చినబాబు అదేనండీ మన చంద్రబాబు గారి అబ్బాయి, నారా లోకేష్. త్వరలో బేబి మూన్ యాత్రకు వెళ్తున్నారట. భార్య బ్రహ్మణితో కలిసి ఈ యాత్రకు వెళ్ళేందుకు లగేజి, వీసా, పాస్ పోర్టు వంటివి రెడి చేసుకునే పనిలో ఉన్నారు. తేనెచంద్రుడి(హనీమూన్) గురించి తెలుసు కాని ఈ పిల్ల చంద్రుడు(బేబి మూన్)ఏమిటి అంటారా...? దాని గురించి తెలుసుకుందాం.

హనీమూన్ అంటే పెళ్లి అయ్యాక భార్య భర్తలిద్దరూ వెళ్లి ఏకాంతంగా గడిపటం అని అందరికి తెలిసిందే. ఇక బేబి మూన్ అంటే భార్య గర్బంతో ఉన్న సమయంలో, దంపతులిద్దరూ కలిసి ఏకాంతంగా విహారయాత్రకు వెళ్ళటం అన్నమాట. ఇలా బేబిమూన్ టూర్ వెళ్ళటం వల్ల ఇంట్లో పరిస్థితుల కారణంగా భర్తతో చెప్పుకోలేని విషయాలు చెప్పుకుని, తన అభిప్రాయాలు పంచుకునేందుకు భార్యకు సమయం ఉంటుంది. ఇలా చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, కొత్త ఉత్సాహంతో ఉంటారని ఫలితంగా బిడ్డలు ఆరోగ్యంగా పుడతారు అని సర్వేలు చెప్తున్నాయి. దీంతో ఈ మద్య బేబి మూన్ టూర్లు ఎక్కువ అవుతున్నాయి.

అదీ బేబిమూన్ సంగతి. లోకేష్ బాబు భార్య బ్రహ్మణి, ప్రస్తుతం గర్బవతి. దీంతో భార్యను బేబిమూన్ టూర్ కోసం అమెరికా తీసుకెళ్తున్నారు. సరదాగా గడపటానికి రెండు సంవత్సరాల తర్వాత తనకు, బ్రహ్మణికి సమయం దొరికిందనీ.., అదీకాక వచ్చే నెల నుంచి బ్రహ్మణి ప్రయాణించటం వీలు కాదు కాబట్టి, త్వరలోనే ఈ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. అమెరికా టూర్ షెడ్యూల్, సందర్శించే స్థలాలు రహస్యంగా ఉంచారు. వీరిద్దరి బేబి మూన్ టూర్ ఆనందంగా జరగాలని కోరుకుంటూ..., హ్యాపీ అండ్ సేఫ్ జర్ని చెప్పేద్దాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  baby moon  pregnant  latest news  

Other Articles