Rob o neill named as seal team six hero who killed osama bin laden

Rob O'Neill, Navy Seal, Team Six, Real hero, Osama bin Laden, America, AlQeida, pakistan, Threat, 30 top targets, films, 52 awards, No easy day

Rob O'Neill named as Seal Team Six hero who killed Osama bin Laden

అల్ ఖైదా అధినేత లాడెన్ ను చంపిందెవరో తెలుసా..?

Posted: 11/07/2014 02:58 PM IST
Rob o neill named as seal team six hero who killed osama bin laden

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరుడు గట్టిన ఉద్రవాద సంస్థకు అధ్యక్షడు ఆయన. అమెరికాలోని ప్రఖ్యాతి గాంచిన ట్విన్ టవర్స్ ను కూల్చడం వేనుక ప్రధాన సూత్రదారుడు అతను. లక్ష్యాన్ని ఎంచుకున్న తరువాత.. అతడిపై మాటు వేసి దొంగదెబ్బ తీయడంలో అతనికి అతనే సాటి, కానీ అలాంటి ఉద్రవాద నాయకుడినే అంతంమొందించిన సాహసవీరుడు కూడా ఒకరుంటారు. అయినా వారు ప్రపంచానికి పరిచయం కారు. తమకు పేరు, ఖ్యాతి రావాలని వారు ఏ పనులు చేయరు. ఇంతకీ ఆ సాహసవీరుడెవని అనుకుంటున్నారా..? అతడి పేరే రాబ్ ఓ నీల్..

ఇతని పేరు మీరెప్పుడూ వినలేదు. ఎందుకంటే ఇతను మీకు తెలియదు. ఇతడు అమెరికా రక్షణ శాఖలో ఉద్యోగి. ఇతను చేసినదంతా ఆ కరుడు గట్టిన ఉగ్రవాది నాయకుడిని తుదముట్టించడమే. ప్రపంచాని శాసిస్తున్నాను అన్న భ్రమలో బతుకుతూ, మతచాందసవాదాన్ని అనువనువునా నింపుకున్న అల్ ఖైదా అధినేత ఒసామాబిన్ లాడెన్ ను మట్టుబెట్టింది నీలే. నిత్యం దొంగలా బతుకులీడ్చి.. పరాయి వారందరినీ అనుమానించి, చివరకు నీడకు కూడ నమ్మలేని స్థాయి చేరుకునన్న ఒబామా పాకిస్థాన్లోని ఓ నివాసంలో తలదాచుకోగా .. ఆ ఇంట్లోకి చోరబడి లాడెన్ తలలో బుల్లెట్ దింపిన ఘనుడు రాబ్ ఒ నీల్.

Rob-O-Neill

ఇన్నాళ్లూ ఆ ఘనతను అమెరికన్‌ నేవీ సీల్‌ టీమ్‌కు ఆపాదించారు. నిజానికి తొలిగా లాడెన్‌ ఒంట్లోకి బుల్లెట్‌ దింపిన వ్యక్తి ఆ టీమ్‌లో ఎవరో ఒకరే అయి ఉంటారు. కానీ, ఉగ్రవాదులు వారిని టార్గెట్‌ చేస్తారన్న భావనతోనే ఆ వ్యక్తి ఎవరో ఇన్నాళ్లూ బయటకు రానివ్వలేదు. కానీ ఇప్పుడా వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతడి పేరు.. రాబ్‌ ఓ నీల్‌. త్వరలో అతడి ఇంటర్వ్యూ ఫాక్స్‌ న్యూస్‌లో ప్రసారం కానుంది. లాడెన్‌ను అతడు ఎలా చంపిందీ.. ఇన్నాళ్లుగా అజ్ఞాతం లో ఎందుకున్నదీ తదితర వివరాలు ఆ ఇంటర్వ్యూలో తెలియనున్నాయి.

అయితే, వాటిని డెయిలీమెయిల్‌ పత్రిక ముందుగానే సేకరించి తన సైట్‌లో పేర్కొంది. రిటైరయ్యాక యూఎస్‌ సర్కారు తనను పట్టించుకోవట్లేదని.. తన ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏ సదుపాయాలూ కల్పించలేదని, ఈ నిరాశతోనే అతడీ విషయాలను బయటపెట్టడానికి నిర్ణయించుకున్నట్టుగా ఆ కథనం వివరించింది. అంతే కాదు.. దీనిపై రాబ్‌ ఓ నీల్‌ తండ్రితో ఇంటర్వ్యూ కూడా చేసింది.

రాబ్‌ ఓ నీల్‌ నిజంగానే అమెరికాలో పెద్ద హీరో. ఇరాక్‌, ఆఫ్గనిస్థాన్‌ సహా పలు యుద్ధాల్లో 400 కంబాట్‌ మిషన్లలో పాల్లొని.. 30 మందికి పైగా టాప్‌ టార్గెట్లను కాల్చి చంపిన అతణ్ని గొప్ప ‘సీల్‌’గా పరిగణిస్తారు. నిజజీవితంలో అతడి సాహసకృత్యాల ఆధారంగా మూడు హాలీవుడ్‌ సినిమాలు(కెప్టెన్‌ ఫిలిప్స్‌, జీరో డార్క్‌ థర్టీ, లోన్‌ సర్వైవర్‌) వచ్చాయంటే అతడెంత గొప్ప యుద్ధవీరుడో అర్థం చేసుకోవచ్చు. అయితే.. లాడెన్‌ను రాబ్‌ మూడుసార్లు తలపై కాల్చి చంపినట్టు ఒక కథనం ప్రచారంలో ఉండగా, తొలిసారి అతడు కాల్చగా లాడెన్‌ కింద పడిపోయాడని, అప్పుడు మరో ఇద్దరు సీల్స్‌ అతడి ఛాతీపై మరో రెండు బుల్లెట్లు దించినట్టు ఇంకో కథనం ఉంది. కాకపోతే, వెర్షన్లు వేరైనా తొలిసారి కాల్చింది మాత్రం నీలేనని స్పష్టమవుతోంది.

మోంటానాలోని బూట్‌ గ్రామంలో పెరిగిన రాబ్‌ ఓ నీల్‌.. 19 ఏళ్ల వయసులో ప్రేమ విఫలమైందన్న బాధ నుంచి బయటపడటానికి నేవీ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అదే అతడి జీవితాన్ని మార్చేసింది. 16 ఏళ్ల సర్వీసులో రాబ్‌ 52 సార్లు పతకాలు అందుకున్నాడు. కాగా.. లాడెన్‌పై దాడిలో పాల్గొన్న సీల్స్‌ బృందంలో ఇలా బయటకు వచ్చిన రెండో వ్యక్తి రాబ్‌. ఇతడి కంటే ముందు.. మాథ్యూ బిసొనెట్‌ అనే మరో సీల్‌.. లాడెన్‌ను తాము ఎలా చంపిందీ వివరిస్తూ ‘నో ఈజీ డే’ అనే వివాదాస్పద పుస్తకంతో వెలుగులోకి వచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles