Telangana assembly adjourned twice amid ruckus over farmers suicides

telangana assembly, butget, CM, KCR, congress, Telangana TDP, opposition, assembly adjourned, speaker, madhusudhana chary

telangana assembly adjourned twice amid ruckus over farmers suicides

రైతు ఆత్మహత్యలపై అట్టుడిన అసెంబ్లీ.. 2 సార్లు వాయిదా.

Posted: 11/07/2014 01:01 PM IST
Telangana assembly adjourned twice amid ruckus over farmers suicides

తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశఆలలో వాయిదాల పర్వమే ఎరుగని శాసనసభ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల నిరసనల మధ్య శాసనసభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే రెండుసార్లు పది నిమిషాల చోప్పున వాయిదా పడింది. ఇశాళ సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు రైతుల ఆత్మహత్యలపై చర్చకు పట్టుబట్టాయి. చర్చ జరపాలంటూ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. సెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రైతు సమస్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే స్పీకర్ మధుసుదనా చారి ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. బీఏసీ నిర్ణయం ప్రకారం ప్రశ్నోత్తరాలు చేపట్టిన తర్వాత మిగతా అంశాలపై చర్చిద్దామని స్పీకర్ సూచించారు.

అయినా విపక్ష సభ్యులు వినకపోడడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. శాసనసభలో అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.  ఏ సమస్యపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విపక్షాలు ఆందోళన చేయటం తగదన్నారు. రైతుల ఆత్మహత్యలపై కూడా చర్చిస్తామని... ఇదే పద్ధతి అనుకుంటే ఏమీ చేయలేమన్నారు. వారం...పది రోజులు కాదని... అవసరం అయితే 40 రోజుల పాటు అన్ని సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు.

చర్చకు తాము సిద్ధమన్నా విపక్షాలు  తీరు మార్చుకోకుంటే ...వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. అయినా విపక్షాలు తమ పట్టువీడలేదు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగింది.  బీఏసీ సమావేశం నిర్ణయం ప్రకారం ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాతే వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని స్పీకర్ మధుసుదనా చారి సూచించినా, విపక్ష సభ్యులు  పోడియం చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభను స్పీకర్ పదినిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష సభ్యులు పట్టువీడకపోవటంతో స్పీకర్ మరోసారి సభను పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly  butget  CM  KCR  congress  Telangana TDP  opposition  assembly adjourned  speaker  madhusudhana chary  

Other Articles