Ghost appears in selfie of two girls

Ghost, Selfie, Ghost in selfie, London bar, London girl selfie, Viral, Social media, Newcastle, Snapchat., Victorian outfit

A selfie of two Newcastle-based girls clicked at a bar in London has gone viral on social media for there was a "ghost" standing behind the girls.

వాళ్ల ఫోటోలకు ఫోజులిచ్చి.. సంచలనం సృష్టించింది..

Posted: 11/01/2014 09:31 AM IST
Ghost appears in selfie of two girls

ఎవరైనా ఫొటోలు తీసుకుంటుంటే.. మధ్యలో నేనూ వస్తా అంటూ చిన్న పిల్లలు దూరేస్తుంటారు. ఇది సర్వసాధారణం. అయితే, న్యూక్యాస్టిల్ ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలు తీసుకున్న ఫోటోలలో వచ్చిన ఆమె.. ఇప్పుడు సంచలనాత్మకంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ తీసుకునే వారిని ఓ క్షణం అలోచించేలా చేస్తుంది. అసలు పిలవని పేరంటానికి వచ్చినట్టు.. వారిద్దరి ఫోటలోల మధ్యకు ఎందుకు వచ్చింది..? ఎందకని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.? ఇంతకీ ఆమె ఎవరు అనేగా మీ డౌట్స్..

లండన్ లోని న్యూ క్యాస్టిల్ ఇద్దరు స్నేహితురాళ్లు కలిసారు. అయితే చానాళ్లకు కలసిన వారు ఇద్దరు కలసి దగ్గర్లోని బార్ కు వెళ్లి మధ్యం సేవించారు. ఇక బాయ్ అని చెప్పుకునే ముందు ఇద్దరికీ ఒక అలోచన వచ్చింది. అదే మళ్లీ ఎప్పుడు కలుస్తామో.. అందుకని సెల్పీ తీసుకుందామనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఫోటోలకు ఫోజులిచ్చి ఫోటో తీసుకున్నారు. అయితే వారి ఫోటోల మధ్యలోకి వచ్చిన ఓ మహిళ వారి అనుమతి లేకుండానే ఫోటోలకు ఫోజులిచ్చింది. తాను వారి సెల్పీలో హల్ చల్ చేసింది. విక్టోరియా మహారాణి దుస్తుల్లో వున్న సదరు మహిళ నిజానికి మాత్రం అక్కడ లేదు. దీంతో తమ వెనకాల నిలబడింది దెయ్యం అని గమనించిన అమ్మాయిలు ముందుగా స్నాప్ చాట్ లో తమ ఫోటోను అప్ లోడ్ చేశారు. అనంతరం కొంత భయానికి లోనైన వారు తమ ఫోన్ల నుంచి ఫోటోలను తోలగించారు.

ఇద్దరు అమ్మాయిల వెనకాల ఓ 'దెయ్యం' నిలబడినట్లుగా ఫొటోలో ఉంది. ఈ ఫొటోలో ఉన్న దెయ్యం.. బాగా వృద్ధ మహిళగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ ఫొటో.. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. విక్టోరియా గ్రీవెస్ (22), కేలీ ఆట్కిన్సన్ (23) అనే ఇద్దరు కలిసి న్యూ కేజిల్లో 'గరల్స్ నైట్'ను ఎంజాయ్ చేశారు.  ఒకటి రెండు పెగ్గులు పుచ్చుకున్న తర్వాత ఈ ఫొటో తీసుకున్నారు. అయితే, ఫొటోలో తామిద్దరం కాక మరో వ్యక్తి ఉన్నట్లు వెంటనే గుర్తించారు. విక్టోరియన్ దుస్తులు ధరించిన వృద్ధ మహిళ ఆ ఫొటోలో కనిపించింది. వెంటనే వాళ్లు ఆ ఫొటోను స్నాప్చాట్లో అప్లోడ్ చేశారు. తర్వాత ఎందుకైనా మంచిదని, తమ ఫోన్లలోంచి డిలీట్ చేసేశారు. కానీ ఆ ఫొటో మాత్రం వరుసపెట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూనే ఉంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles