Beer prices are increased in andhra pradesh

beer, hike, prices, increase, andhra pradesh, committee, Excise department, 100 cr Income, demand, supply, production

beer prices are increased in andhra pradesh

‘బీరు’బలుల జేబులకు చిల్లులు.. అమాంతం పెరిగిన ధరలు

Posted: 11/01/2014 09:39 AM IST
Beer prices are increased in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని మధ్య రహిత రాష్ట్రంగా చేస్తానని ఎన్నికల ముందు హామీలను గుప్పించిన చంద్రబాబు ప్రభుత్వం.. మధ్యంతోనే అధిక ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. ఇక మరోమారు దాని జోలికి వెళ్తే.. రాష్ట్ర ఆదాయంలో కోతలు తప్పమని గ్రహించినట్లు వుంది. అందుకే మధ్యం జోలికి, మధ్యం దుకాణాల జోలికి వెళ్లకుండా.. గుట్టుచప్పుడు కాకుండా ధరలను అమాంతం పెంచి.. తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలోనే బీరుబలుల( బీరు సేవించే వారు) జేబులకు చిల్లులు పడనున్నాయి. అదేనండి త్వరలో బీరు ధరలు పెరగనున్నాయి. ఒక్కో బీరు ధర ప్రస్తుతం ఉన్నదాని కన్నా ఐదు రూపాయల వంతున పెంచేందుకు ధరల నిర్ణాయక కమిటీ ఆమోదం తెలిపిందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. సంబంధిత ఫైలు ప్రభుత్వానికి చేరిందని సమాచారం. ఒక్కో బీరుపై ఐదు రూపాయల చొప్పున పెంచడంతో ఏడాదికి అదనంగా రూ. 100 కోట్లు వస్తాయని అధికారులు తెలిపారు. 2010 సంవత్సరం నుంచి బీరు ధరలు పెంచాలని తయారీ కంపెనీలు కోరుతున్నాయని, ఈ నేపథ్యంలో ఇప్పుడు ధరలు పెంచక తప్పనిసరి పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా మధ్యం మాఫియా మాత్రం జడలు విప్పి నృత్యం చేస్తుంది. అధికార, విఫక్షాలకు చెందిన అనేక మంది నాయకులు ఈ మాఫియాలో క్రీయాశీలక సభ్యులుగా వున్నారని గత ప్రభుత్వంలో మద్యం మాఫియాపై జరిగిన దాడులు, వెలుగు చూసిన నిజాలతో ఏసీబీ అధికారులే స్పష్టం చేశారు. ఇప్పడు రాష్ట్ర విభజన జరిగిన తరువాత మరికొంత మంది అధికార పక్షం సభ్యులు మధ్యం మాఫియాలో చేరారని సమాచారం. దీంతో వారు చెప్పినట్లు చేసేందుకు కూడా ప్రభుత్వాలు వెనక్కు పోవడం లేదని తెలిసింది. మద్యం ధరలు, తాజాగా బీరు ధరల పెంపు కూడా మద్యం మాఫియా నిత్రంతణలో సాగుతోందని సమాచారం.

ఇలా ఉండగా రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీలో బీరు, మద్యం కొరత ఏర్పడిందని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వినియోగానికి, సరఫరాకు మధ్య గత వ్యత్యాసాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉందన్నారు. ప్రస్తుతం మద్యంను తెలంగాణ నుంచి, బీర్లను పాండిచ్చేరి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అవసరమైన మద్యం, బీర్లను ఉత్పత్తి చేసేందుకు వీలుగా కొత్తగా మద్యం, బీర్లు తయారీ కంపెనీలకు అనుమతించనున్నట్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beer  hike  prices  increase  andhra pradesh  committee  Excise department  100 cr Income  demand  supply  production  

Other Articles