America president barrack obama credit card gets cloned faces trouble

Us President, credit card, cloned, trouble barrack obama, financial fraud

America President barrack obama credit card gets cloned, faces trouble

అమెరికా అధ్యక్షుడు ఒబామా క్రెడిట్ కార్డు క్లోనింగ్ ...

Posted: 10/18/2014 01:55 PM IST
America president barrack obama credit card gets cloned faces trouble


ఆయన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు. ఆయన జోలికి దేశాధినేతలు వెళ్లాలంటే ముందు వెనక అలోచిస్తారు. కానీ ఆయనను ఒక సాధారణ వ్యక్తి ముచ్చెమటలు పట్టించాడు. బరాక్ ఒబమాతో పెట్టుకుని నువ్వా నేనా అంటూ ఆటాడుకున్నాడు. అయితే ఇదంతా ప్రత్యక్షంగా కాదులెండి.. పరోక్షంగానే. అయినా ఎంతటి దుస్సాహసానికి ఒడిగట్టాడు. ఇస్లామిక్ స్టేట్, ఐఎస్ఐ, తాలిబయన్ ఉగ్రవాదులతో తలపడుతున్న అమెరికా అధ్యక్షుడిని చెమటలు పట్టించిన వాడు ఒక దోంగ అంటే నమ్ముతారా..? నిజమండీ.. ఒక దెంగ ఒబామాను ముచ్చెమటలు పట్టించాడు.

ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు ఒబామా న్యూయార్క్ వెళ్లారు. తీరా అక్కడ ఏదో హోటల్లో క్రెడిట్ కార్డు వాడదామని చూస్తే.. ఆ కార్డు తిరస్కరణకు గురైంది. అగ్రరాజ్యానికే అధ్యక్షుడు తన కార్డు తిరస్కరణకు గురైంది.. ఇంకేముంది విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డా.. అపడం మాత్రం కష్టం. తన పరువు ఏం కాను. తన ప్రతిష్టతకు ఎంత భంగం..? ఇలా ఆలోచిస్తూనే.. ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనుకున్నారు. విషయం ఏమిటంటే.. ఆయన క్రెడిట్ కార్డును ఎవరో క్లోన్ చేసి వాడేశారని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరోలో చెప్పారు. క్రెడిట్ కార్డు మోసాల్లాంటి విషయాల గురించి ఆయన వివరించారు.

తాను పెద్దగా వాడకపోయినా అప్పుడే లిమిట్ ఎలా అయిపోయిందా అనుకున్నానని, అప్పుడు తనకు ఏదో మోసం జరిగినట్లు అర్థమైందని నవ్వుతూ చెప్పారు. అదృష్టవశాత్తు మిషెల్ కార్డు మాత్రం బాగానే ఉందని ఒబామా తెలిపారు. అమెరికాలో క్రెడిట్ కార్డులకు చిప్ అండ్ పిన్ తరహా రక్షణ కల్పించే ఉత్తర్వులపై ఒబామా సంతకం చేశారు. చివరకు తాను కూడా దీని బారిన పడ్డానని, ఆ విషయం హోటల్లో వెయిట్రెస్కు చెప్పేసరికి తల ప్రాణం తోకకు వచ్చిందని ఆయన అన్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికాలోనే అది సాక్షత్తు అదేశ అధ్యక్షుడి క్రెడిట్ కార్డే క్లోనింగ్ జరగడంపై అమెరికాలో విచారణ సాగుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Us President  credit card  cloned  trouble barrack obama  financial fraud  

Other Articles