However do you react lokesh babu

chandrababu, sailajanath, Handri-Neeva, projects, challenges, lokesh babu

sailajanath challenges chandrababu for debate on projects, will lokesh react on this..?

మీరైనా స్పందిస్తారా లోకేష్ బాబు..?

Posted: 10/11/2014 05:26 PM IST
However do you react lokesh babu

సామాజిక వైబ్ సైట్ ట్విట్టర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ విద్యత్ సంక్షోభంపై, అభివృద్దిలో తన తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై పశ్నల వర్షం సంధిస్తున్న నారా లోకేష్ బాబుకు ఇది ఒక ఇబ్బందికర పరిణామమే నని చెప్పాలి. తన తండ్రిపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను భరించలేని యువనేత లోకేష్.. ట్విట్టర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నే టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రప్రధశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శైలజానాథ్ విసిరిన సవాల్ పై నారా లోకేష్ ఎలా స్పందిస్తారు.. అసలు స్పందిస్తారా లేదా..? అన్నది ఇప్పడు చర్చనీయాంశంగా మారంది.

హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను శైలజానాథ్ ఖండించారు. దీనిపై బహిరంగ చర్చకు శైలజనానాథ్ సవాల్ విసిరారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో కేవలం ప్రాజెక్ట్లకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకున్నారని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఓ పక్క రైతులు సాగునీటితో ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు మాత్రం టూరిజం అంటూ సమావేశాలు పెట్టుకోవటం శోచనీయమన్నారు. బాబు నోట సింగపూర్, మలేషియా తప్ప మరో మాట రావటం లేదని శైలజానాథ్ ఎద్దేవా చేశారు.

మరి హంద్రీనీవా ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబును లోకేష్ బాబు ఒప్పించగలరా..? అని రాజకీయ పండితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ పదేళ్ల తరువాతైనా తెలంగాణలో ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది. అంతేకాదు హైదరాబాద్ శాంతిభద్రతలు కూడా తెలంగాణ ప్రభుత్వమే చూసుకోవాల్సి వుంటుంది. ఈ తరుణంలో శైలజానాధ్ సవాల్ ను స్వీకరిస్తే.. అవి నిజంకాదని రుజువు చేయాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా చేసిన పక్షంలో మరో ఐదేళ్ల కాలం కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించి వారిని అధికారంలోకి రానీయకుండా అడ్డుకోగలిగే క్రెడిల్ చంద్రబాబుకే దక్కతుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై యువనేత లోకేష్ ఎలా స్పందిస్తారో.. అసలు స్పందిస్తారో..? లేదో..? చూడాలి మరి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  sailajanath  Handri-Neeva  projects  challenges  lokesh babu  

Other Articles