Ebola joke spark scares in us flight

ebola, passenger joke, us flight, US Airways, Philadelphia, Punta Cana

ebola joke spark scares in us flight

ప్రాక్టికల్ జోక్.. ఆగిన అమెరికా ఫ్లైట్

Posted: 10/11/2014 04:18 PM IST
Ebola joke spark scares in us flight

రోజు చచ్చు జోకులు వేసుకుని వేసుకుని బలవంతాన వవ్వడం బోర్ కోట్టందనుకుంటా.. ప్రాక్టికల్ జోక్ వేయాలని తలపించాడు. అనుకున్నదే తడవుగా తాను ఎక్కడున్నాడన్న విషయం మర్చిపోయి.. ప్రాక్టికల్ జోక్ వేశాడు. విమానయానంలో ప్రస్తుతం చేయకూడని పని తుమ్మడం, చీదడం. పొరబాటున చేసినా.. వెంటనే సారీ అని చెబితే సరిపోతుంది. కానీ సారీ, నేను ఇప్పడే దక్షిణాఫ్రికా నుంచి వచ్చాను అన్నారనుకోండి.. అంతే మీ పని అయినట్టే. మిమ్మల్ని ఉన్నపళ్లన ఫైట్ అటెండర్ తిట్టిపోస్తుంది. అదినూ పబ్లిక్ గా ఇడియట్, స్టుపిడ్ అంటూ వచ్చిన తిట్లన్నింటినీ వళ్లించేస్తుంది. తాను అకారణంగా మరణిస్తున్నాను అని తెలిసినప్పుడు మనిషిలో రగిలే ద్వేషాలే అటెండెంట్ లోనూ కలుగుతాయి. అదేంటి తుమ్మడం కూడా పాపమా అనుకుంటున్నారా..? కాదు దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన తరువాత తుమ్మడం మరణశాసనమే..!

దీనికి కారణం ఇబోలా.. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఈ వ్యాధి పేరు చెబితేనే గడగడలాడుతున్నాయి. కానీ ప్రాక్టికల్ జోక్ చేయాలనుకున్న యువకుడు సరిగ్గా దానినే వాడుకున్నాడు. అయితే, తనకు ఈ వ్యాధి ఉందంటూ ప్రాక్టికల్ జోక్.. వేశాడు. అమెరికాకు చెందిన విమానం 845 ఫిలడెల్ఫియా నుంచి డొమినికన్ రిపబ్లిక్ లోని పుంటా కనాకు వెళ్తుండగా అతడు వేసిన జోక్ తో విమానాన్ని అత్యవసరంగా లాస్ వేగాస్ లో కిందకు దింపారు. రుయ్ రుయ్ అంటూ అంబులెన్సులు, హజ్ మత్ బృందాలు (ప్రమాదకరమైన వస్తువులను తీసే) బృందం నీలిరంగు సూట్లు వేసుకుని విమానంలోకి చేరుకున్నాయి.

విమానం గమ్యం చేరుకోగానే హజ్ మత్ స్క్వాడ్ వస్తున్నందున ప్రయాణికులంతా కూర్చోవాలని కేబిన్ సిబ్బంది కోరారు. అప్పటివరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీవ్ర అందోళనకు గురైన విమాన ప్రయాణికులకు అసలు విషయం తేలింది. హజ్ మత్ బృందాలతో అ యువకుడు అసలు విషయం చెప్పాడు. తాను కేవలం ప్రాక్టికల్ జోక్ వేశానన్నాడు. తాను దక్షిణాఫ్రికాకు చెందిన వాడిని కాదని, అక్కడి నుంచి రాలేదని కూడా వివరించడంతో హజ్ మత్ బృందాలు వెనుదిరిగాయి. యువకుడు ప్రాక్టికల్ జోక్ వేశాడని తెలుసుకున్న ప్రయాణికులు ఊపిరు పీల్చుకున్నారు. కేవలం సరదా కోసమే తాను ఇదంతా చేశాడని తెలుసుకున్నారు. తాను 36 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నానని, కానీ ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి ప్రాక్టికల్ జోకులు వేయలేదని, అసలు విషయం తెలిసేవరకు తన నరాలు బిగుసుకుపోయాయని ఓ ఫ్లైట్ అటెండెంట్ తెలిపింది.

ఈ మొత్తం తతంగాన్ని కొంతమంది ప్రయాణికులు సెల్ఫోన్లలో వీడియో తీశారు. దాన్ని యూట్యూబ్లో పెట్టగా, దానికి భారీ హిట్లు వచ్చాయి. నీలిరంగు సూట్లు వేసుకుని వచ్చిన వాళ్లతో తాను ఊరికే జోకు వేశానని, తాను ఆఫ్రికానుంచి రాలేదని చెబుతున్నట్లు కూడా ఆ వీడియోలో ఉంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ebola  passenger joke  us flight  US Airways  Philadelphia  Punta Cana  

Other Articles