Chandrababu naidu office expense 20crore rupees

chandrababu naidu, chandrababu naidu wiki, chandrababu naidu latest, chandrababu naidu photos, chandrababu naidu family, chandrababu naidu comments, andhrapradesh, andhrapradesh government, andhrapradesh news, andhrapradesh map, secratariat, andhrapradesh secratariat, telangana secratariat, latest news

ap cm chandrababu naidu office expense rupees twenty crore rupees : for chandrababu naidu secratariat office government spent 20 crore rupees

చంద్రబాబుకు అంత అవసరమా అంటున్నారంతా...!

Posted: 10/04/2014 10:14 AM IST
Chandrababu naidu office expense 20crore rupees

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రతిపక్షాలు మరోసారి విమర్శల  పర్వం కొనసాగిస్తున్నాయి. ఏపీ సెక్రటేరియట్ లో బాబు కార్యాలయం ఖర్చుకు చంద్రబాబు ఏకంగా రూ.20కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. దీనిపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. మహా అయితే రెండు లేదా  మూడేళ్ళపాటు వినియోగించే ఈ కార్యాలయం కోసం ఇంతగా ఖర్చు చేయటం అవసరమా అని  విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనంను నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తోంది.

రాష్ర్ట విభజన తర్వాత సచివాలయంను కూడా రెండుగా విభజించారు. ఇందులో భాగంగా ఏపీ సీఎఎం కోసం ముందుగా  హెచ్ బ్లాకును ఎంపిక చేశారు. అయితే వాస్తు బాగా లేదని ఎల్  బ్లాకును ఎంపిక చేశారు. దీనిలో భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. దీంతో ఎల్ బ్లాకులో కార్యాలయం భద్రత కోసం భారీగా డబ్బు ఖర్చు చేశారు. ఎల్ బ్లాకులోని ఎనమిదవ అంతస్థులో ఉన్న ఆఫీసును బుల్లెట్  ప్రూఫ్ గా మార్చారు. కార్యాలయంలో సకల సౌకర్యాలు కల్పించారు. సీఎం ఛాంబర్ తో పాటు కాన్ఫరెన్స్ హాలు, మంత్రులతో భేటి కోసం మరో హాలు, లాంజ్, సీఎం కార్యదర్శులు,  ముఖ్య ర్యదర్శుల  కోసం చాంబర్లను  రూపొందించారు. వీటన్నిటికి 20కోట్ల మేర ఖర్చయిందని అధికారులు చెప్తున్నారు.

బాబుకు ముప్పు పొంచి  ఉందన్న హెచ్చరికలతో ఇన్ని భద్రతా చర్యలు చేపట్టారు బాగానే ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు ఉండేది ఎంత కాలం అంటే కేవలం రెండు నుంచి మూడేళ్ళు మాత్రమే. విజయవాడలో వారానికి మూడు రోజులు ఉంటాననీ.., అంతేకాకుండా వీలైనంత త్వరలో కార్యాలయాలు ఏపీకి తరలించేందుకు  చర్యలు తీసుకోవాలని ప్రభుత్వమే ఆదేశించింది. ఈ నేపథ్యంలో మూడేళ్ళ తాత్కాలిక కార్యాలయం కోసం ఇంత డబ్బు ఖర్చు అవసరమా అని విమర్శలు  వస్తున్నాయి. కార్యాలయం ఎనమిదవ అంతస్థులో ఉండటం వల్ల భద్రతాపరమైన ఇబ్బంది  ఉంది. అదే ఒకటవ అంతస్థులో ఉన్నా..,  హెచ్  బ్లాకులో ఉన్నా ఇంత ఖర్చు జరిగేది కాదని విమర్శలు  వస్తున్నాయి. అయినవారికే తెలియాలి దీనికి కారణం.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  chandrababu naidu  secratariat  latest news  

Other Articles