Ar rahaman is witness to jayalalitha case

jayalalitha, jayalalitha arrest, jayalalitha case, jayalalitha latest, jayalalitha da case, jayalalitha case details, jayalalitha imprisoned, jayalalitha and sashikala, jayalalitha son sudhakaran, latest news, chennai, tamilnadu, bangalore, court, jail, marriages, rich marriages, marriage details

in jayalalitha case music director ar rahaman and musicians mandolen srinivas, ilayaraja attended before court as witness : in jayalalitha case of marriage issue ar rahamanm musicians mandolen srinivas, ilayaraja told court that they taken gold, silver and silk gifts from the party

జయకోసం రెహ్మాన్, మ్యుజిషియన్ల సాక్ష్యం

Posted: 10/04/2014 10:19 AM IST
Ar rahaman is witness to jayalalitha case

అక్రమాస్తుల కేసులో జయలలిత అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బెంగళూరు సమీపంలోని జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. 66కోట్లకు సంబంధించిన అక్రమాస్తుల కేసులో జయకు 4ఏళ్ళ  జైలు శిక్షతో పాటు  100కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. 18ఏళ్లపాటు సాగిన కేసు దర్యాప్తు, విచారణలో అనేక మలుపులు తిరిగింది. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు సుధాకరన్ పెళ్లి జయ జైలుకు  దారి తీసింది. కీలకమైన ఈ కేసులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సాక్ష్యం చెప్పాడు.

నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మన్ తో పాటు మ్యుజిషియన్లు మాండలిన్ శ్రీనివాస్, గంగై అమరన్,  ఇళయరాజా సోదరుడు కూడా హాజరయ్యారు. పెళ్ళికి వచ్చినవారికి బంగారు, వెండి వస్తువులతో పాటు నాణ్యమైన సిల్కు బట్టలను ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ  కేసు విచారణలో భాగంగా పెళ్లికి వెళ్ళిన  సంగీత ప్రముఖులను కోర్టు విచారించిందట.

పెళ్లి  సందర్బంగా జరిగిన  సంగీత  కచేరికి తామంతా హాజరయ్యామని.. ఆ సమయంలో జయ ఇచ్చిన బంగారు, వెండి వసతువులతో పాటు సిల్కు వస్తువులు, వస్త్రాలను కూడా తీసుకున్నట్లు అంగీకరించారట. దీంతో ఈ ఆరోపణలు నిజమే అని న్యాయమూర్తి నిర్ధారించారు. వీరి సాక్ష్యం ఆధారంగా జయలలితకు అక్రమాస్తులు ఉన్నట్లు దృవీకరించారు. ఈ ఘటనను బట్టి జయ ఆడంబరాలు, అవినీతి సంపాదన కళ్జకు కడుతుందని తీర్పు సందర్బంగా న్యాయమూర్తి మైఖేల్  వ్యాఖ్యానించారు. ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమని నమ్మేందుకు ఇంతకు మించిన సాక్ష్యాలు అవసరం లేదని అన్నారట. అంటే జయమ్మ జైలుకు వెళ్ళటానికి కీలక మైన సాక్ష్యాలు అందించింది  మన మ్యుజిషియన్లే అన్నమాట.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  ar rahaman  latest news  arrest  

Other Articles