Tdp leader talasani srinivas yadav met kcr

kcr, kcr comments, kcr family, camp office, cm camp office, begumpet camp office, kcr farm house, kcr funny, kcr latest, trs, telangana rastra samiti, latest news, talasani srinivas yadav, tdp leaders, tdp, telugu desam party, politics, telangana

tdp leader talasani srinivas yadav met kcr in camp office : talasani ready to come out from tdp so that he met trs chief and state chief minister kcr in camp office today

గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీకి గట్టి దెబ్బ

Posted: 09/29/2014 11:58 AM IST
Tdp leader talasani srinivas yadav met kcr

ఉమ్మడి రాజధానిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టికి గట్టి దెబ్బ తగలనుంది. తెలంగాణలో ఇప్పటికే చాలామంది నేతలు సైకిల్ వదిలేసి కారు ఎక్కారు. కొంతమంది కారులో సీటు కోసం ఎదురుచూస్తున్నారు. అటు గ్రేటర్ లో జెండా ఎగరేయాలని చూస్తున్న గులాబిదండు.. నేతలను లాగే పనిలో ఉంది. టీడీపీ అసంతృప్తులను ఏరికోరి.., వరాలు ప్రకటించి మరి వలవేసి లాగుతోంది. దీంతో గ్రేటర్ లో టీడీపీకి ఉన్న పట్టు కోల్పోతోంది. ప్రధాన నేతలు కారు ఎక్కేందుకు కండువాలు తెచ్చుకోవటంతో.., పసుపుదళం వన్నె తగ్గుతోంది.

ఇందులో భాగంగానే టీడీపీ నేత.., పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సారధి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ అధినేతను కలిశారు. సోమవారం ఉదయం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఈ భేటిలో ప్రధానంగా గ్రేటర్ లో పరిస్థితులపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశ వివరాలు బయటకు వెల్లడించకపోయినా.., పార్టీలో చేరికపై కేసీఆర్ తలసాని మద్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున సనత్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన శ్రీనివాస్ యాదవ్ కొద్దికాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

పార్టీ మారుతున్నట్లు తలసాని ఎక్కడా చెప్పకపోయినా.., ఆయన వ్యవహార శైలి చూస్తే మాత్రం ఇదే వాస్తవమని స్పష్టం అవుతోంది. గతంలో కూడా తలసాని ఓ సారి కేసీఆర్ ను కలిశారు. ఈ క్రమంలోనే సోమవారం చర్చల్లో మరింత క్లారిటీ కోరినట్లు తెలుస్తోంది. తలసానికి ఇచ్చే పదవులపై క్లారిటీ వస్తే చేరికకు ముహూర్తం ఖాయమైనట్లే అని అంతా అంటున్నారు. కేబినెట్ విస్తరణ జరగనుందున కేసీఆర్ ఓ మంత్రి పదవిని కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అటు కొందరయితే ఇప్పటికే పదవులు ఖరారు అయినట్లు చెప్తున్నారు. అయితే స్పష్టమైన ప్రకటన మాత్రం రావటం లేదు.

గ్రేటర్ లో టీఆర్ఎస్ పట్టుకోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం టీడీపీ నుంచి బలమైన నేతలను లాగుతోంది. హైదరాబాద్ పరిధిలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న తలసాని.. పార్టీ మారితే ఆయనతో పాటు కిందిస్థాయిలోని చాలామంది నేతలు కార్యకర్తలు కూడా గులాబి కండువా కప్పుకుంటారు. దీని వల్ల రానున్న గ్రేటర్ ఎన్నికల్లో జీహెచ్ ఎంసీలో జెండా పాతాలన్న కేసీఆర్ కల నెరవేరుతుంది. అయితే ఈ చేరికలు.. పార్టీలో లుకలుకలపై చంద్రబాబు గమనిస్తున్నా ఎలాంటి ప్రకటనా చేయటం లేదు. చూడాలి మరి ఈ సారి చంద్రబాబు చంద్రశేఖరుడిపై ఎలా స్పందిస్తారో.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talasani srinivas yadav  latest news  kcr  telangana  

Other Articles