Five years old telugu boy owned doctorate

dheeraj, dheeraj doctorate, doctorates, honoraray doctorate, dheeraj honorary doctorate, latest news, telugu students, telugu famous persons, delhi world record university, boy doctorate, latest news, universities, ukg student doctorate

five years old telugu boy dheeraj owned doctorate with his excellent talent : delhi world records university to give doctorate to ukg student dheeraj for his talent

శభాష్.. యూకేజి తెలుగబ్బాయికి డాక్టరేటు

Posted: 09/29/2014 10:47 AM IST
Five years old telugu boy owned doctorate

తెలివి ఎవరి సొత్తు కాదు అని ఓ తెలుగబ్బాయి నిరూపించాడు. ఎందరో మహామహులు.. ఏళ్ళు కష్టపడ్డా సాధించలేని పనిని పుట్టిన ఐదేళ్ళకే సాధించాడు. పరిశోధనలు చేసి.., ఎంతో ప్రతిభ ఉంటే తప్ప రాని గౌరవ డాక్టరేటు ఆ బుడతడికి ఐదేళ్లకే వస్తోంది. ఇదంతా తెలుగబ్బయి ధీరజ్ గురించి. తన అసమాన ప్రతిభతో ఐదేళ్లకే డాక్టరేట్ అందుకుంటున్న తెలుగుతేజం ధీరజ్. స్పష్టంగా అన్ని మాటలు కూడా పలుకరాని వయస్సులో ఏకంగా మూడు రికార్డులు నెలకొల్పి అందరిచే శబాష్ అన్పించుకున్నాడు.

చెన్నైలో ఉంటున్న ధీరజ్ తెలివి గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండేళ్ళ వయస్సులో 2నిమిషాల 19సెకన్లలో 215 జాతీయ పతాకాలను గుర్తుపట్టాడు. ఇక మూడున్నరేళ్ళ వయస్సులో 83మంది శాస్ర్తవేత్తల పేర్లను వారు ఆవిష్కరించిన వాటితో సహా ఒకే నిమిషంలో చెప్పాడు చివరకు గజిబిజిగా ఉండే వరల్డ్ మ్యాప్ పజిల్ ను 3నిమిషాల 20 సెకన్లలోపూర్తి చేశాడు. ఇలా చిన్న వయస్సులోనే అసమాన ప్రతిభ చూపి వరుసగా మూడు సార్లు రికార్డులు నెలకొల్పాడు. ఇతని ప్రతిభను చూసి ముచ్చటపడటంతో పాటు మెచ్చుకున్న వరల్డ్ రికార్డ్స్ యునివర్సిటీ ఆఫ్ ఢిల్లీ.., గౌరవ డాక్టరేటును ప్రకటించింది.

ధీరజ్ కు డాకర్టేటును ప్రకటించటం పట్ల అతని కుటుంబం సంతోషంలో మునిగి తేలుతోంది. అతిచిన్న వయస్సులో డాక్టరేటు సాధించిన వ్యక్తి తమ అబ్బాయి మరో అరుదైన రికార్డు నెలకొల్పుతున్నాడని టాలెంటెడ్ బాయ్ పేరంట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బుడతడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి తనకున్న మేధో సంపత్తితో దేశానికి మంచి పేరు తేవాలని తెలుగు విశేష్ కోరుకుంటోంది. ఆల్ ది బెస్ట్ ధీరజ్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dheeraj  telugu boy  doctorate  delhi world records university  

Other Articles