Hyderabas metro rail brought under central metro rail act

Hyderabad, Metro Rail, Telangana government, central Act, Metro Rail Act, G.o

Hyderabad Metro Rail brought under the purview of central Metro Rail Act

ఢిల్లీకి పరుగులు తీసిన మెట్రో రైలు..

Posted: 09/24/2014 12:09 PM IST
Hyderabas metro rail brought under central metro rail act

హైదరాబాద్ మెట్రో రైలు ఢిల్లీకి పరుగులు తీసింది. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలతో పనులు కొనసాగించలేమని గతంలో ప్రకటించిన మెట్రో రైలు నిర్మాణ సంస్థ.. కేంద్రంలో తన పరపతిని వినియోగించి.. రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి తప్పుకుంది. హైదరాబాద్ మెట్రో రైలును కేంద్ర మెట్రో రైలు చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పనులు ట్రామ్‌వే చట్ట పరిధిలో కొనసాగుతున్నాయి. దీంతో రైల్వే భద్రత బోర్డు ఈ ప్రాజెక్టు భద్రతా వ్యవహారాలను పరీక్షించేందుకు నిరాకరిస్తోంది. కేంద్ర చట్టం పరిధిలోకి రానిదే భద్రతా వ్యవహారాలను పరీక్షించబోమని తెలిపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోరైలు తొలిదశ మార్గంపై అధికారికంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు మార్గాల్లో 71.16 కిలోమీటర్ల మేర చేపడుతున్న మెట్రో రైలు పనులను తన పరిధిలోకి కేంద్రం తీసుకోచ్చింది.

మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గాన్ని కారిడార్-1గా,  జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా మార్గాన్ని కారిడార్-2గా, నాగోలు నుంచి శిల్పారామం మార్గాన్ని కారిడార్-3గా కేంద్రం తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. మియాపూర్, ఫలక్‌నుమా, ఉప్పల్‌లో డిపోలను నిర్మిస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మెట్రో రైలును ట్రామ్‌వే చట్టం పరిధిలోంచి.. కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు చట్టం పరిధిలోకి తీసుకొచ్చినట్లుగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ చట్టం ప్రకారం అలైన్‌మెంట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు వెల్లడించింది.  

అయితే కేంద్రం జీవో జారీ చేసినప్పటికీ అవసరాలకు అనుగుణంగా మార్గంలో మార్పులు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కేంద్ర చట్టం పరిధిలోకి తీసుకురావడంతో భద్రతా పరీక్షలకు మార్గం సుగమమైందని.. భద్రతా పరీక్షలు చేపట్టేందుకు రైల్వే బోర్డు నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. మెట్రో రైలు నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలు, ఆరోఫణలు, మీడియా కథనాలతో విసిగిపోయిన తెలంగాణ ప్రభుత్వం.. మెట్రో రైలు పనులను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని యోచించినట్టు తెలుస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Metro Rail  Telangana government  central Act  Metro Rail Act  G.o  

Other Articles