No permissions for new layout

Andrapradesh government, no permissions, new layouts, capital, masterplan, prepares, vijayawada, guntur, mangalagiri, Tenali

Andrapradesh government says no permissions to new layouts untill capital masterplan prepares in vijayawada, guntur, mangalagiri and Tenali

అక్కడ కొత్త లేఅవుట్ లకు అనుమతులు లేవ్

Posted: 09/21/2014 12:51 PM IST
No permissions for new layout

ఆంధ్రప్రదేశ్ లో అందునా విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది రాజధాని అంశం. తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగతుందని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో.. ఎక్కడ నిర్మాణం ఎక్కడ జరుగుతుందంటూ.. విజయవాడ వాసులు ఉత్కంఠకు గురవుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏ ప్రాంతంలో భూములను పరిశీలిస్తోందన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు బెడవాడ వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు.

రాజధాని నిర్మాణం జరగడం వల్ల తమ ఇళ్లకు, పంట పోలాలకు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని అక్కడి వారు సంతోషిస్తున్నారు. మరీ ఎక్కువగా పోలాలు వున్న వారు లే-అవుట్ లకు అనుమతులు తీసుకుని కొత్త వెంచర్లకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కొత్త వెంచర్ల కోసం ఇబ్బడిముబ్బడిగా వచ్చిన ధరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్న క్రమంలో.. ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. గతంతో అనుమతులు ఇచ్చిన లే- అవుట్ లకు ఎలాంటి ఢోకా లేదన్న సర్కారు.. కొత్తగా ఎలాంటి లే- అవుట్ లకు అనుమతులు ఇవ్వకూడదని అదేశించింది.

నూతన రాజధాని మాస్టర్‌ప్లాన్ సిద్ధమయ్యే వరకు విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో కొత్త లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాత పూర్వక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా.. రాజధాని పరిసర ప్రాంతాల్లో మాస్టార్ ప్లాన్ సిద్దమయ్యే వరకు లేఅవుట్లను అనుమతించ కూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీజీటీఎంయూ పరిధిలో కొత్త లేఅవుట్లకు అనుమతులు ఇవ్వకూడదంటూ నెల రోజుల క్రితం ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు రాత పూర్వకంగా లేకపోవడంతో అధికారుల్లో లేఅవుట్ల అనుమతులు ఇవ్వాలా? వద్దా? అన్న సందిగ్ధం నెలకొంది.

విజయవాడ పరిసరాల్లో రాజధాని ఉంటుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. కొత్త లేఅవుట్లకు సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయి. 10 ఎకరాల్లోనూ స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. గతంలో చేసిన దరఖాస్తులకు అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో ప్రభుత్వం రాతపూర్వక ఆదేశాలు జారీ చేసింది. నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేంత వరకు భారీ విస్తీర్ణంలోని లేఅవుట్లకు అనుమతులు ఇవ్వకూడదని పేర్కొంది.

ఇందులో ఎంత విస్తీర్ణంలోని లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలి? వేటికి అనుమతులు ఇవ్వకూడదన్న విషయమై స్పష్టత కరవైంది. దీంతో ప్రస్తుతం పెండింగ్‌లోని దరఖాస్తులతో పాటు, కొత్త దరఖాస్తులను పక్కన పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్త లే-అవుట్ల దరఖాస్తులు తీసుకోకూడదని నిర్ణయించారు. పురపాలక శాఖ ఇచ్చిన రాతపూర్వక ఆదేశాలతో రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోతుందని రిజిస్ట్రేషన్ల శాఖ పేర్కొంటోంది. దీంతో అనుమతి పొందిన వాటితో పాటు అక్రమ లేఅవుట్లలోనూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles