Sachin help to kashmir flood victims

jammu kashmir, kashmir, jammu, kashmir floods, jammu floods, jammu kashmir floods, kashmir latest news, kashmir flood victims, kashmir relief fund, kashmir flood deaths, kashmir secratariat, kashmir relief camps, kashmir homes, jammu kashmir food, sachin tendulkar, indian army in kashmir floods, ndrf, national disaster relief force, rescue operations, sachin help to kashmir flood victims, latest news

master batsman sachin tendulkar shows his mercy and kind heart on kashmir flood victims by sending huge amount of helping material : sachin and his sponsers also some of business persons sent relief material flood kashmir flood victims

సర్వం కోల్పోయిన వారికి సచిన్ సాయం

Posted: 09/21/2014 01:02 PM IST
Sachin help to kashmir flood victims

క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ మరోసారి తను కరుణా హృదయుడనని చాటాడు. ప్రకృతి కోపానికి వరదలు వచ్చి సర్వం కోల్పోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సచిన్ సాయం చేశాడు. వరద బాధితులకు ఉపయోగపడేలా దుప్పట్లు, ఆహారం, తిరిగి ఆహారం తయారు చేసుకోవడానికి ముడి సరుకులు పంపించాడు టెండుల్కర్. సుమారు ఐదు టన్నుల ఆహార పధార్ధాలతో పాటు, వెయ్యి దుప్పట్లను పంపించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు వరద నీరు కలుషితంగా ఉండటంతో అవే నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడకుండా వాటర్ ఫిల్టర్లను కూడా పంపించాడు.

దాదాపు నాలుగు వందల వాటర్ ఫిల్టర్లను, క్లోరిన్ టాబ్లెట్లను పంపించినట్లు తెలుస్తోంది. వీటి వల్ల సుమారు పదివేల మందికి మంచి నీరు అందటంతో పాటు కొన్ని గ్రామాల ప్రజలకు తినేందుకు తిండి లభించినట్లయింది. సచిన్ సాయం చేయటంతో పాటు.., ఆయన పిలుపునివ్వగా పలువురు వ్యాపారవేత్తలు కూడా చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మాస్టర్ అంబాసిడర్ గా ఉన్న పలు వ్యాపారసంస్థలు కూడా చేతనైన సాయం చేసినట్లు సన్నిహితులు తెలిపారు. దేశ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే సాయం చేసిన సచిన్ మంచి మనస్సును అందరూ మెచ్చుకుంటున్నారు.

22ఏళ్లలో ఎన్నడూ లేని భీకర వరదలు ఈ నెల మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్ ను ముంచెత్తాయి. ఈ వరదలతో కాశ్మీర్ లోయలోని వందల గ్రామాలు నీట మునిగాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యపై అధికారిక లెక్కలు ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది. ఇళ్లు కూలిపోయి వేలాది మంది నిరాశ్రయులు కాగా.., లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారు. వీరందరిని ఆర్మీ, విపత్తు నిర్వహణా ప్రత్యేక బృందాలు వారం రోజులకు పైగా ప్రత్యేక సహాయక కార్యక్రమాలు చేపట్టి కాపాడాయి. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించిన ప్రధాని తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు కేటాయించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kashmir floods  sachin tendulkar  kashmir relief fund  latest news  

Other Articles