Prime minister narendra modi sensational comments on indian muslims

narendra modi, pm narendra modi latest news, modi latest news, narendra modi comments muslims, narendra modi muslims, narendra modi america media, narendra modi latest press meet, pakistan terrorists, indian muslims

prime minister narendra modi sensational comments on indian muslims that they will do anything for their nation.

ఇండియన్ ముస్లిముల ప్రాణాల మీద మోడీ వ్యాఖ్యలు!

Posted: 09/19/2014 09:21 PM IST
Prime minister narendra modi sensational comments on indian muslims

(Image source from: prime minister narendra modi sensational comments on indian muslims)

నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటినుంచి ఆయన మతతత్వ నాయకుడు అంటూ విమర్శలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే! నేడు ప్రధానమంత్రి అయినా కూడా అటువంటి ఆరోపణలు ఇంకా వెల్లువెత్తుతూనే వున్నాయి. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత పలు హిందూ గ్రూపులు, ముస్లింలపై పరుష పదుజాలంతో విరుచుకుపడ్డాయి కూడా! ఇప్పటికీ హిందూ, ముస్లింల మధ్య ఏదోఒక చిన్నకారణంతో గొడవలు జరుగుతూనే వున్నాయి. దీంతో మోడీ ఎప్పటికైనా మతతత్వ నాయకుడేనంటూ ప్రత్యర్థ పార్టీలు ఆయనను విమర్శిస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ మాత్రం ఇంతవరకు ఈ గొడవలకు, ముస్లిములకు సంబంధించి నోరు మెదపలేదు. కానీ.. ఇన్నాళ్లతర్వాత తాజాగా ఆయన ముస్లిముల మీద చేసిన కామెంట్లు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేశాయి. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

భారతదేశంలో వున్న ముస్లిముల ఉదాత్తమైన మనోభావాలను మోడీ ప్రపంచానికి ఎలుగెత్తి చూపి.. అందరినీ షాక్ కు గురిచేశారు. ‘‘ఇండియన్ ముస్లింలు దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశంకోసం ప్రాణాలను అర్పించేందుకు కూడా వెనుకాడరు. భారత్ కు ఎలాంటి నష్టం జరగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు’’ అంటూ ఓ అమెరికా టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వున్న మోడీ శత్రువులు సైతం నోళ్లవెళ్లబెట్టుకుని కూర్చుండిపోయారు. మతతత్వ నాయకుడంటూ ఇన్నాళ్లవరకు విమర్శిస్తూ వస్తున్న వారుసైతం మోడీని ప్రశంసించేశారు. వీళ్లేకాదు.. భారతీయ ముస్లిములు కూడా మోడీని ఆకాశానికే ఎత్తేశారు. మోడీ చేసిన కామెంట్లు ముస్లిములు హర్షం వ్యక్తం చేస్తూ.. ఆయన తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయమంటూ హామీలు ఇస్తున్నారు.

ఇంకా ఆ అమెరికా ఇంటర్య్యూలో మోడీ మాట్లాడుతూ.. ‘‘అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారతీయ ముస్లింల గురించి తప్పుగా అర్థం చేసుకుంటోంది. తమ ట్యూన్లకు అనుగుణంగా భారతీయ ముస్లింలు స్టెప్పులేస్తారని భ్రమిపడుతోంది’’ అని కూడా మోడీ వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడున్న ముస్లిములు భారతీయ పౌరులని.. తమ దేశగౌరవాన్ని చాటిచెప్పడం కోసం దేనికైనా సిద్ధపడతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఇస్లాం పేరిట జరుగుతున్న విశ్వవ్యాప్త పోరులో పాలుపంచుకోవాలని భారతీయ ముస్లింలకు పిలుపునిచ్చారు. ఇటీవల అల్ ఖైదా చీఫ్ అయిమాన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియోపై మోడీ ఈ మేరకు ఘాటుగా స్పందించారు. తద్వారా భారతీయ ముస్లింల గొప్పదనాన్ని, దేశభక్తిని ప్రపంచానికి తెలియజేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : narendra modi  indian muslims  pakistan terrorists  al qaeda group  

Other Articles