Kcr asks bankers to agree for waiver crop loans

kcr, k.chandra shekar rao, bankers meeting, telangana, telangana government, latest news, crop loans, waiver, reschedule, schedule bonds, agreements

in bankers meeting held on tuesday kcr asks to agree for waiver crop loans : reschedule bank loans, or take bonds but government decission will not changed says kcr

కొంచెం కోపరేట్ చేయాలని కోరిన కేసీఆర్

Posted: 09/16/2014 06:46 PM IST
Kcr asks bankers to agree for waiver crop loans

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట కోసం నానా తంటాలు పడుతున్నారు. రైతు రుణ మాఫి కుదరదని రిజర్వు బ్యాంకు ప్రకటించినా కేసీఆర్ మాత్రం వినటం లేదు. హామిని అమలు చేస్తామని చెప్తున్నారు. మంగళవారం జరిగిన తెలంగాణ బ్యాంకర్ల సమావేశంలో కూడా ఇదే చెప్పారు. రుణాలు రీషెడ్యూల్ చేయండి, లేదా, బాండ్లు తీసుకోండని బ్యాంకు అధికారులకు చెప్పారు. ఏది ఏమైనా హామిపై వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. రుణమాఫి అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.

కేసీఆర్ మొండిపట్టుకు స్పందించిన బ్యాంకర్లు... రుణమాఫి చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి త్వరలోనే చెప్తామన్నారు. రూ.లక్ష లోపు రైతు రుణాలను మాఫి చేస్తామని ఎన్నికల ముందుగా హామి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామి అమలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రిజర్వు బ్యాంకు రుణమాఫి చేయలేమని చెప్పింది. తెలంగాణలో గతంతో పోలిస్తే పంటలు బాగానే పండాయని.., మరి రుణమాఫి ఎందుకు చేయాలని ప్రశ్నించింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లయింది. అయినా సరే హామిని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ కొన్ని షరతులు, కొత్త విధానాలను తీసుకొచ్చారు. ఈ షరతుల్ని అధికారికంగా ప్రకటించకుండా.., మంత్రుల చేత అప్పుడప్పుడూ మీడియా నోట వినబడేలా చెప్పి స్పందన చూశారు.

షరతులపై రైతు వర్గాల నుంచి కాస్త వ్యతిరేకత వ్యక్తం అయింది. వెంటనే అలాంటిదేమి లేదని అంతా ఉత్తుత్తి.. అని ప్రకటించారు. రుణమాఫి చేసి తీరుతామని రైతులు భయపడ్డవద్దని చెప్పారు. ఇటు బ్యాంకర్లు కూడా కేసీఆర్ ను ఓసారి ఆలోచించుకోవాలని కోరాయి. ఆయన మాత్రం ఎవరి మాట వినట లేదు. ఏదేమైనా హామి అమలు చేయాల్సిందే అని పంతం పట్టి కూర్చున్నారు. చివరకు కేసీఆర్ గురించి తెలిసిన బ్యాంకర్లు ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. మరి వీరు ఎలా స్పందిస్తారో చూడాలి. కూటి కోసం కోటి తిప్పలు అన్నట్లుగా.., ఓట్ల కోసం హామిల తిప్పలు.., అప్పులు తప్పవు అని విమర్శకులు చమత్కరిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  bankers meeting  crop loans  latest news  

Other Articles