Kcr orders women employees to celebrate batukamma in offices also

batukamma, batukamma celebrations, tankbund batukamma, saddula batukamma, batukamma songs, batukamma movie songs, batukamma telangana songs, telangana batukamma, kcr, secratariat, telangana, telangana culture, telangana government, latest news, telangana secratariat employees, women's festivals

telangana chief minister asks women employees of secratariat to celebrate batukamma in office also : kcr gives order to women employees work for 2pm only during batukamma celebrations time

ఆఫీసుల్లో పండగ చేసుకోవాలని కేసీఆర్ ఆదేశం

Posted: 09/17/2014 10:34 AM IST
Kcr orders women employees to celebrate batukamma in offices also

తెలంగాణ అంటే ఉద్యమాలకు పోరాటాలకే కాదు.., సంబురాలు, సంతోషాలకు కూడాపుట్టనిల్లు. చిన్న కార్యక్రమం జరిగినా అంతా ఏకమై సంబరాలు చేసుకుంటారు. విందులతో పండగ వాతావరణం రెడిగా ఉంటుంది. తెలంగాణ వారు ఎక్కువగా సంబరాలు చేసుకుంటారు అని పేరు కూడా ఉంది. ఇక దసరా వచ్చిందంటే ఆ సంతోషం, కోలాహలం చెప్పలేము. పండగకు పది రోజుల ముందు నుంచే బట్టలు కొనుక్కోవటం.., పిండివంటలు.. పిల్లల కోసం సిద్దం చేసే ఇతర వెరైటీలు, ఇలా ఏ ఇంట్లో చూసినా సంతోషం వెల్లివిరుస్తుంది. ఇదే సమయంలో బతుకమ్మ తెలంగాణలో కొలువుదీరుతుంది. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు ప్రకృతిలో సహజసిద్దంగా దొరికే పూలతో పండగను చేసుకోవటం ఆనవాయితీ.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ఆత్మగౌరవానికి పెద్దపీఠ వేసే ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ సందర్బంగా తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగిణులకు ఊరట ఇచ్చారు. బతుకమ్మ జరిగే నవరాత్రి రోజులూ వారికి పనివేళలు తగ్గించారు. సాధారణంగా కార్యాలయాల పనివేళలు సాయంత్రం వరకు ఉండగా.., నవరాత్రి ఉత్సవాల రోజుల్లోమాత్రం కేవలం మధ్యాహ్నం రెండు గంటల వరకే మహిళా ఉద్యోగులు ఆఫీసులో పనిచేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఇంటికివెళ్లి బతుకమ్మలు ఆడుకోవాలని ఆదేశించారు. ఈ మద్య ముఖ్యమంత్రిని కలిసిన మహిళా ఉద్యోగిణులకు ఈ వెసులుబాటు కల్పించారట. ఈనెల 23నుంచి అక్టోబర్ 2వ తేది వరకు ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుంది.

అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. అయితే ఇధి మధ్యాహ్నం తర్వాతా లేక మధ్యాహ్నం వరకు ఉండే పనివేళల్లోనా అనే విషయం చెప్పలేదు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పండగ వాతావరణం కన్పించాలని ఉద్యోగిణులకు సూచించారు. అందంగా అలంకరించుకుని దసరా ఉత్సవాలకు సిద్ధమయినట్లుగా కార్యాలయాలు ఉండాలని చెప్పారు. ఇక బతుకమ్మ ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.10 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. ప్రతి జిల్లాకు రూ.10 లక్షలను కేటాయించటంతో పాటు అవసరమైతే అదనంగా నిధులు కూడా కేటాయిస్తామని కలెక్టర్లకు చెప్పింది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ఆదేశించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : batukamma  telangana secratariat  women's festivals  latest news  

Other Articles