Ap dsc notification in a week

dsc, tet, b.ed course, b.ed colleges, andhrapradesh colleges, hyderabad colleges, b.ed exam, counselling, latest news, ganta srinivas rao, ap government, andhrapradesh, school assistant, s.g.t.

minister ganta srinivasrao says will release dsc notification in four days : govt is reviewing b.ed students to be allowed to sgt posts

మూడు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్

Posted: 09/08/2014 09:16 AM IST
Ap dsc notification in a week

ఏపీ ప్రభుత్వం కొలువుల జాతరను మొదలు పెట్టింది. నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మరో మూడు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్సీ ద్వారా దాదాపు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు.

ఇక ఎస్.జీ.టి.లో బీ.ఎడ్ అభ్యర్ధులకు అవకాశం ఇస్తామన్న ఎన్నికల హామిపై పరిశీలన జరుపుతున్నట్లు మంత్రి చెప్పారు. ఈ విషయంపై ఉన్నతస్థాయి అధికారుల బృందం ప్రత్యేకంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. డీఎస్సీకి అభ్యర్ధులంతా సిద్దం కావాలని సూచించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టీ.టీ.సీ. విద్యార్థులను అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎస్.జీ.టీ. పోస్టులకు మాత్రం బీ.ఎడ్ అభ్యర్ధులను అనుమతించలేదు. దీని వల్ల టీటీసీ విద్యార్థులకు రెండు అవకాశాలు ఉండగా.., అంతకంటే ఎక్కువ చదివిన బీఎడ్ విద్యార్థులకు మాత్రం అవకాశాలు తక్కువ అయ్యాయి.

దీనిపై ఉమ్మడి రాష్ర్టంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఎన్నికల సమయంలో.., బీఎడ్ విద్యార్థులకు టీటీసీలో కూడా అవకాశం ఇస్తామని టీడీపీ హామిఇచ్చింది. ఆ మేరకు హామి అమలు చేస్తే జరిగే పరిణామాలు.., టీటీసీ విద్యార్థుల సంఖ్య, వారికి ఉద్యోగాల్లో ఏర్పడే కోత వంటి అంశాలపై అధికారులు పరిశీలన జరుపుతున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dsc notifiation  andhrapradesh  ganta srinivas rao  latest news  

Other Articles