Tv anchor harshavardhan presented before media

anchor harshavardhan, tv anchor harshavardhan, eluru dental college, church, local tv, cable tvs, blackmailing, latest news, central crime station, ipc sections, westgodawari, police, home minister

tv anchor harshavardhan arrested for blackmailing eluru dental college corrospandent : police presneted anchor harshavardhan infront of media on blackmailing case

యాంకర్ హర్షవర్ధన్ గురించి పోలిసులేమన్నారంటే..

Posted: 09/08/2014 09:44 AM IST
Tv anchor harshavardhan presented before media

డోంట్ గో ఎవే.. బీ అలర్ట్.., కీప్ వాచింగ్ అంటూ తన మాటలతో ప్రేక్షకులను భయపెట్టే హర్షవర్ధన్ పోలిసుల చెరలో బందీగా ఉన్నాడు. టీవీ ముందున్న ప్రేక్షకులను భయపెట్టే హర్ష.., ఓ కాలేజి ప్రిన్సిపల్ ను నేరుగా బెదిరించి అడ్డంగా దొరికిపోయాడు. బ్లాక్ మెయిలింగ్ కేసులో ముఠా మొత్తాన్ని అరెస్టు చేశారు. ఆదివారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు వీరి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈజీ మనీ కోసం గ్యాంగ్ గా ఏర్పడ్డ కొందరు వ్యక్తులు.., అందుకోసం బ్లాక్ మెయిలింగ్ ను ఎంచుకున్నట్లు పోలిసులు చెప్పారు.

పలు టీవీ చానెళ్ళలో ఫ్రీ లాన్సర్ యాంకర్ గా పనిచేస్తున్న హర్ష వర్ధన్ సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలంలోని తండ్రగుంట. ముప్పై ఏళ్ళక్రితమే వీరి కుటుంబం హైదరాబాద్ వచ్చి సెటిల్ అయింది. యాంకరింగ్ లో భాగంగా నల్జర్లలోని సత్యసాక్షి చానెల్ లో కూడా పలు ప్రోగ్రాంలు చేసేవాడు. అలా సాక్షి టీవీ యాజమాన్యంతో పాటు ల్యూక్ బాబుతో పరిచయం ఏర్పడింది. వీరికి విజయ్ కుమార్, చిరంజీవి అనే ఇద్దరితో పరిచయం ఏర్పడింది. వీరంతా రెండు నెలలుగా సులువగా డబ్బు సంపాదించటంపై దృష్టిపెట్టారు.

బ్లాక్ మెయిలింగ్ చేస్తే సులువుగా డబ్బు వస్తుందని భావించి.., బెదిరింపులకు ప్లాన్ సిద్దం చేసుకున్నారు. ఏలూరులోని డెంటల్ కాలేజ్ కరస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్ బెయిల్ చేసి డబ్బులు తీసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. వారం రోజుల క్రితం ఫాదర్ బాలకు ఫోన్ చేసి ‘ మీకు ఇబ్బంది కల్గించే సీడిలు మా దగ్గర ఉన్నాయి, రూ.10 కోట్లు ఇవ్వకుంటే మీకు వ్యతిరేకంగా టీవీల్లో కధనాలు వస్తాయి అని బెదిరించారు. చివరగా రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు. ముందుగా రూ. కోటి ఇవ్వాలని చెప్పాడు. శుక్రవారం ఫాదర్ బాలను కలిసిన హర్ష శనివారం డబ్బులు ఇవ్వాలని చెప్పాడు.

నేరుగా ఎస్సీకి ఫిర్యాదు

ముఠా బ్లాక్ మెయిల్ పై కరస్పాండెంట్ బాల ఎస్పీని ఆశ్రయించారు. స్పందించిన ఎస్పీ కేసు పరిశీలించాలని డీఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. డీఎస్పీ నేతృత్వంలో సీఐ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్లాన్ ప్రకారం డబ్బులు ఇస్తాం రమ్మని చెప్పి నిందితులను పిలిపించారు. డబ్బులకోసం వస్తుండగా.., ల్యూక్ బాబు, చిరంజీవిని పోలిసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు హర్షవర్ధన్ తో పాటు మిగతా నిందితులు విజయవాడలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడి టాస్క్ ఫోర్స్ పోలిసులను అప్రమత్తం చేశారు. విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలిసులు హర్షతో పాటు నగరంలో మకాం వేసిన మిగతా నిందితులను అరెస్టు చేశారు. కేసును ధర్యాప్తు చేస్తున్న ఏలూరు పోలిస్ స్టేషన్ కు వీరందర్నితీసుకువచ్చారు.

ఈజీ మని కోసం ఐదుగురు నిందితులు ముఠాగా ఏర్పడి బ్లాక్ మెయిలింగ్ కు తెరతీసినట్లు డీఎస్పీ తెలిపారు. వీరందరిపై ఐటీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, సెల్ ఫోన్లు, రూ.37,400 డబ్బును స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే వీరిని అలా మీడియా ముందు ప్రవేశపెట్టారో లేదో.., అప్పుడే బెయిల్ ఇచ్చేందుకు కాగితాలు పట్టుకుని ఓ పార్టీ నేతలు పోలిస్ స్టేషన్ కు వచ్చారు. ఇంకేముంది బెదిరింపులకు దిగి అరెస్టయిన నేరస్తులకు ఇలా రాజకీయ అండ దొరికితే వారు ఎక్కడ ఆగుతారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv anchor harshavardhan  westgodawari  police  latest news  

Other Articles