Two couples divorced with silly reasons

couples, marriage, divorce, hindu marriages, latest news, mumbai, maharastra, court, family relations, family problems, sex, fans, summer, winter, rainy, silly

two couples of maharastra get divorced with silly reasons : one couple divorced for husband not doing sex all the time an other husband not permitting to use fan in summer season

హిజ్రా అంటే, ఫ్యాన్ వేయనివ్వలేదని విడాకులు

Posted: 09/07/2014 06:12 PM IST
Two couples divorced with silly reasons

చిన్న, చిన్న కారణాలకు తిట్టుకోవటం కోప్పడటం తెలుసు. చిన్న కారణాలకే కోపం ఎందుకు అని అంటుంటాం కూడా.., కాని ఇప్పుడు చిన్న కారణాలకే దాంపత్య బంధాలు తెగిపోతున్నాయి. మాట అన్నా.., మనసుకు నచ్చని ఏ చిన్న పని చేసినా విడాకులే పరిష్కార మార్గం  అంటున్నారు ఈ తరం జంటలు. మహారాష్ర్టలో ఇలా చిన్న కారణాలతోనే రెండు జంటలు విడిపోయాయి.


తన భార్య ప్రవర్తన నచ్చక సరిచేసుకోమని ఓ మాట అంటే అందుకు విడాకులు ఇచ్చిందని ఓ భర్త వాపోయాడు. అతని వివరాల ప్రకారం... ముంబైలో ఉండే బాధితుడికి 2011లో పెళ్ళి అయింది. భార్య ఇంటిపనులు ఏమి చేయదు. ఎప్పుడు శృంగారం చేయమని భర్తను బలవంతపెడుతుంది. అయితే అన్నిసార్లు చేయటం మంచిదికాదు.., ఆరోగ్యం కూడా పాడవుతుందని వారించేవాడు. ఇలా చెప్పినందుకు తనని హిజ్రా అని తిట్టేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనతో పాటు కుటుుంబ సభ్యులను కూడా ఎప్పడు తిడుతుండేదనీ..,వారిపై తప్పుడు కేసులు పెట్టేదని కోర్టుకు తెలిపాడు. అతని బాధలు విన్న న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.

ఇక మరో కేసులో ఎండాకాలంలో తన భర్త ఫ్యాన్ వేసుకోనివ్వటం లేదని కోర్టుకు భార్య తెలిపింది. కరెంట్ బిల్లు పెరుగుతుందనే సాకుతో ఫ్యాన్ వేయకుండా అడ్డుకుంటాడని తెలిపింది. తన భర్త హింసను భరించలేనంటూ విడాకులు కావాలని కోర్టును కోరింది. కౌన్సిలింగ్ చేసినా వైఖరిలో మార్పు లేకపోవటంతో 14ఏళ్ళ బంధానికి పుల్ స్టాప్ పెట్టేలా కోర్టు విడాకులు ఇచ్చింది. అంతేకాకుండా భార్యకు రూ.10లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

ఇలా చిన్న సమస్యలకే విడాకులు తీసుకుని పండంటి కాపురాలను చేజేతులా కూల్చేసుకుంటున్నారు. సర్దుకుపోతే సంతోషం ఉంటుంది కానీ.., సాధింపులకు పోతే సర్వనాశనం అవుతుందన్న విషయం గ్రహిచటం లేదు ఇప్పటి తరం.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marriage  divorce  silly  latest news  

Other Articles