Elizabeth hurley kiss value rs 49 laks

elizabeth hurley, elizabeth hurley hot, elizabeth photos, elizabeth movies, aids, aids patients, aids treatment, hiv, hiv aids, diseases, sex, condoms, woman, latest news

indian origis kissed elizabeth hurley kiss value is by paying 49laks of rupees : for aids foundation donations indian given rs.49 laks by kissing elizabeth hurley

ముద్దుకావాలా.. అయితే రూ.49లక్షలు ఇవ్వాలి

Posted: 09/07/2014 12:02 PM IST
Elizabeth hurley kiss value rs 49 laks

అమ్మాయి ముద్దుకోసం ఎవరైనా ఏం చేస్తారు. ముందుగా అడుగుతారు. ఆ తర్వాత ఆఫర్లిస్తారు. మెప్పిస్తారు. మురిపిస్తారు చివరకు ముద్దు సొంతం చేసుకుంటారు. అయితే ఇక్కడో వ్యక్తి ముద్దు పెట్టుకునేందుకు ఏకంగా 49 లక్షల రూపాయలు చెల్లించాడు. అతను ముద్దుపెట్టుకుంది మామూలు అమ్మాయిని కాదు. హాలివుడ్ నటి ఎలిజబెత్ హార్లేని. ఎంత ఎలిజబెత్ అయితే మాత్రం  మరీ ముద్దు కోసం అంతా అంటారా. ఊరికే ముద్దుకోసం కాదు. దీనివెనక అసలు సంగతి మరొకటి ఉంది.

హాలివుడ్ ఫేమస్ సింగర్ ఎల్టన్ జాన్ నెలకొల్పిన ఎయిడ్స్ ఫౌండేషన్ నిధుల సేకరణ కోసం వినూత్న కార్యక్రమం చేపట్టారు. నిధుల సేకరణ కోసం ఎలిజబెత్ హార్లే తన ముద్దును అమ్మకానికి పెట్టింది. మద్దుగుమ్మ ముద్దుకోసం వేలంపాట కూడా పెట్టారు. ఈ పాటలో రూ.48, 77,010 లక్షలు చెల్లించి హార్లేను ముద్దుపెట్టుకునే అవకాశాన్ని జులియన్ భారతి అనే భారతీయ సంతతి వ్యక్తి సొంతం చేసుకున్నాడు.

ఇక బెర్క్ షైర్ లో జరిగిన ఖరీదైన ముద్దు కార్యక్రమానికి మిలీనియర్లు ఒక్కో టికెట్ రూ.3.7లక్షలు చెల్లించి మరీ వెళ్ళారట. అంత ఏముందో ఆ ముద్దులో అనుకుంటే పొరపాటే. ముద్దుకోసం కాదు వారంతా వెళ్లింది.. భారతి చెల్లించింది. ఎయిడ్స్ రోగుల సంక్షేమం కోసం ఇదంతా చేశారు. ఇక జూలియన్ భారతికి ఇప్పటికే పెళ్ళి కాగా.., హార్లే ఆస్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ ను పెళ్ళి చేసుకుని విడిపోయింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : elizabeth hurley  kiss  aids  latest news  

Other Articles