Couple plunges to death while taking photo at cliff edge

selfie photographs, Couple Dies, children, Cabo da Roca in west Portugal

Couple plunges to death while taking photo at cliff edge: The couple are believed to have crossed a safety barrier to take the 'selfie', ... A couple 'taking a selfie' on the edge of a cliff died when they fell .

ప్రాణాలు తీసి-అనాథులను చేసిన సెల్పీ మోజు !

Posted: 08/13/2014 09:06 AM IST
Couple plunges to death while taking photo at cliff edge

ప్రాణాలు తీస్తున్న సెల్పీ మోజు..! టెక్నాలజీ పెరిగిన కొద్ది.. ప్రమాదాలు కూడా ఘోరంగా జరుగుతున్నాయి. టెక్నాలజీ వల్ల కలిగిన ప్రమాదాలు చూస్తే.. అందరికి భయం పట్టుకుంది. ఆనందం, అవసరాల కోసం ఉపయోగించే టెక్నాలజీ మనిషి ప్రాణాలను సులభంగా తీస్తుంది. తాజాగా సెల్పీ మరణాలు పెరుగుతున్నాయి. సెల్పీ అంటే కూర్చున్న చోట ఫోటో దిగడం... దానికో క్యాప్షన్ పెట్టడం... అదేదో ఘనకార్యం అన్నట్టు సైట్లో అప్ లోడ్ చేయడం... అంతే! తర్వాత దానికి వచ్చే లైకులు, కామెంట్లు చూసుకుని మురిసిపోవడం. ఇప్పుడు ఈ సెల్పీ మోజు ఓ జంట ప్రాణాలు తీసింది.

పోర్చుగల్ కు చెందిన ఓ జంట కొండ అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. లిస్బన్ కు సమీపంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కాబోడే రోకా కొండ ప్రాంతంలో ఈ దుర్ఘటన సంభవించింది. సెల్ఫీ తీసుకుంటూ వారు మృతి చెందారని పోలీసులు తెలిపారు.

అంతకంటే హృదయవిదారకమైన సంగతేంటంటే ఆ జంటకు ఐదు, ఆరేళ్ల వయసుగల పిల్లలు ఉన్నారు. వారి కళ్ల ముందే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనతో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలారు. ఈ సంఘటన చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆ చిన్నారులు.. ఏం జరిగిందో తెలియక .. అందరి వైపు బిక్కమొహలతో చూడటం అందరి మనసును కలిసి వేసింది. ఇలాంటి టెక్నాలజీ వల్ల ఇద్దరు పిల్లలను అనాథులుగా మారారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : selfie photographs  Portugal Resident  Polish couple died  

Other Articles