Andhra ias officers vs telangana constable

andhra pradesh ias officer, telangana constable, Governor, posting issue, telangana constable behavior, police behavior

Andhra ias officers vs telangana constable: andhrapradesh ias officers syambabu and telangana police constable

ఐఏఎస్ అధికారిపై కానిస్టేబుల్ పెత్తనం!

Posted: 08/13/2014 09:44 AM IST
Andhra ias officers vs telangana constable

ఉమ్మడి రాష్ట్రం, రాష్ట్రం విడిపోయిన.. అన్నదమ్ముల్లా ఉందాం!! అని పలిక గొంతులు, ఇప్పుడు కాకి కూతులు కూస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అరాచకాలు, వివాదాలు, రేపుతూ.. ప్రజల మనసు పాడు చేస్తున్నాయి. అధికార స్థాయి మరిచిపోయి, వెకిలి చేష్టాలు చేస్తూ.. తెలుగు వారి పరువును తీస్తున్నారు.

రాష్ట్రం సాధించుకున్నది పగ కోసమా? లేక అభివృద్ది కోసమా ! అంతగా పగ అనేది ఉంటే.. ఒక్కసారి యుద్ద భూమిలో కలబడితే సరిపోతుంది కదా! ప్రతి రోజు , ప్రతి అధికారిపై, ప్రతి నేతపై ఈ గిల్లి గజ్జాలు ఎందుకు? కొత్త సమస్యను సృష్టించి ఏం సాధించాలో ఒక్కసారి చెప్పండి?

కొత్త పిచ్చికి కాలం తెలియదని విధంగా వ్యవహరిస్తే.. భవిష్యత్తులో.. ఘోరంగా నష్టపోవాల్సి వస్తుందని మేథావులు అంటున్నారు. ఇలాంటి పనుల వల్ల ఎవరికి ఎలాంటి లాభం ఉండదు కానీ, ప్రజల మనసు గాయపడుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒక ఐఏఎస్ అధికారిని పై ఒక కానిస్టేబుల్ పెత్తనం చేయటం అందరు ఆశ్చర్యపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తోన్న ఐఏఎస్ అధికారి శామ్ బాబు ను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ అడ్డుకోవడం వివాదస్పదమవుతోంది. నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నాక్)కు డైరక్టర్ గా శాంబాబును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నియమించింది.

తన విధుల్లో భాగంగా నాక్ లోపలకి ప్రవేశించబోతున్న ఆయనను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపి... ఆ కానిస్టేబుల్ శాంబాబును నాక్ లోపలకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. ఈ విషయాన్ని, శాంబాబు గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకువెళ్లారు. తన విధులకు ఆటంకం కలిగించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామన్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ లో ఆంధ్రా అధికారులకు జరుగుతోన్న అవమానాలపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు ఆయనను డిమాండ్ చేస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ias officers  andhra pradesh  telangana state  telangana constable behavior  

Other Articles