Kcr ruling like thuglak comment by ap minister ganta

kcr, ganta srinivas rao, telangaana, andhrapradesh, ap, ruling, thuglak, telangaana ap latest news

ganta fires on kcr says his ruling like thuglak : kcr ruling is like thuglak in telangaana said ganta

తెలంగాణ తుగ్లక్

Posted: 08/11/2014 10:00 AM IST
Kcr ruling like thuglak comment by ap minister ganta

తెలుగు రాష్ర్టాలు రెండుగా విడిపోయాయి. కలిసున్నపుడు ఎలాగు సంతోషంగా లేము కనీసం విడిపోయి కలిసుందాం అనుకున్న మాటలు కేవలం నీటి మూటలుగా మిగులుతున్నాయి. రాష్ర్టం రెండు ముక్కలయి రెండు నెలలు దాటింది. ఇప్పటి వరకు ఏ విషయంలోనూ తెలుగు రాష్ర్టాలు కలిసి ఉండటం లేదు. ప్రతిరోజు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవటానికే సరిపోతుంది. ఇక పాలనను కూడా అదేవిధంగా కొనసాగిస్తున్నాయి రెండు ప్రభుత్వాలు.

అయితే తెలంగాణలోని సీమాంధ్రులపై ఈగ కూడా వాలనివ్వమని చెప్పిన కేసీఆర్, ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డ తర్వాత అనుసరిస్తున్న విధానాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అవుతోంది. తెలంగాణ సర్కారు చేసే సర్వేలు, ఫీజు చెల్లింపుకు నిబంధనలు అన్నీ పరోక్షంగా సీమాంధ్రులను టార్గెట్ చేసినవే అని ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా కేసీఆర్ తెలంగాణ తుగ్లక్ అని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. తుగ్లక్ పాలనను గుర్తుకు తెచ్చేలా తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయాలున్నాయని ద్వజమెత్తారు.

సీమాంధ్రులను టార్గెట్ చేసే రహస్య ఎజెండాలతో సర్వేలు చేయిస్తున్నారని విమర్శించారు. 94 అంశాలతో కూడిన సర్వేలోని పలు అంశాలపై గంటా అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వానికి అవసరం లేని, ప్రజల వ్యక్తిగత వివరాలను తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి సర్వే అసలు ఉద్దేశ్యం మరొకటి అని స్పష్టమవుతోందన్నారు.

స్థానికతకు రాజ్యాంగ నిబంధనలు కాదని కేసీఆర్ కొత్తగా 1956 నిబంధనను తీసుకువచ్చి వింత పోకడలు అనుసరిస్తున్నారని విమర్శించారు. అటు ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసినా ఇంకా మారరా అని ప్రశ్నించారు. కేసీఆర్ విపరీత బుద్దితో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్దారు. ప్రధాని మోడిని ఫాసిస్టు అంటున్న కేసీఆర్ ముందు తానేంటో తెలుసుకోవాలన్నారు.

అక్రమ కట్టడాలంటూ కూల్చివేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, పాతబస్తీలోని భవనాల జోలికి ఎందుకు వెళ్ళటం లేదని ప్రశ్నించారు. అక్రమాలపై ప్రాంతాలవారీగా నిబంధనలుంటాయా అని ప్రశ్నించారు. ధమ్ముంటే ముందు పాతబస్తీలో అక్రమ కట్టడాలపై ద్రుష్టిపెట్టాలని సవాల్ విసిరారు. ఎన్నో ఏళ్ళుగా కష్టపడి ఇళ్ళు కట్టుకుని ఉంటున్నవారిని దుర్మార్గంగా, దుర్బుద్దితో ఇబ్బందుల పాలు చేయటం మంచిది కాదని గంటా హితవు పలికారు.

RK

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangaana  kcr  ganta  andhrapradesh  

Other Articles